కరోనాతో మృతి చెందిన తొలి కేంద్ర మంత్రి
Sakshi Education
కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి, కర్ణాటక బీజేపీ ఎంపీ సురేశ్ అంగడి (65) కన్నుమూశారు.
ఆయనకు కొద్దిరోజుల క్రితం కరోనా సోకింది. మూడు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలోని ట్రామా సెంటర్‌లో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 23న తుదిశ్వాస విడిచారు. కరోనా వల్ల చనిపోయిన తొలి కేంద్ర మంత్రి ఈయనే. 1955 జూన్ 1న చెన్న బసప్ప, సోమవ్వ దంపతులకు కర్ణాటకలోని బెళగావి తాలూకా కేకే కొప్ప గ్రామంలో సురేశ్ అంగడి జన్మించారు. బెళగావిలోని ఎస్‌ఎస్‌ఎస్ కాలేజీలో కామర్స్‌లో పట్టా పొందారు. అనంతరం న్యాయ విద్య అభ్యసించారు. బెళగావి లోక్‌సభ స్థానం నుంచి 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా లోక్‌సభకు ఎన్నికయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 23
ఎవరు : సురేశ్ అంగడి (65)
ఎక్కడ : ఢిల్లీ ఎయిమ్స్
ఎందుకు : కోవిడ్-19 వ్యాధితో
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 23
ఎవరు : సురేశ్ అంగడి (65)
ఎక్కడ : ఢిల్లీ ఎయిమ్స్
ఎందుకు : కోవిడ్-19 వ్యాధితో
Published date : 24 Sep 2020 05:03PM