కరోనాతో ఏఆర్‌సీఐ డైరెక్టర్ కన్నుమూత
Sakshi Education
కరోనా మహమ్మారి మరో ప్రముఖ శాస్త్రవేత్తను కబళించింది.
హైదరాబాద్ శివార్లలోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్‌సీఐ) డైరెక్టర్ జి.పద్మనాభం(56) జూన్ 3న అమెరికాలో మరణించినట్లు ఏఆర్‌సీఐ తెలిపింది. పద్మనాభం ఐఆర్‌సీఐ అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని, వినూత్న సాంకేతికత అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారని వివరించింది. బీడీఎల్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలలో పని చేసిన పద్మనాభం... 2005లో ఏఆర్‌సీఐలో చేరారు. సెంటర్ ఫర్ లేజర్ ప్రాసెసింగ్ ఆఫ్ మెటీరియల్స్ విభాగానికి నేతృత్వం వహించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్‌సీఐ) డైరెక్టర్‌కన్నుమూత
ఎప్పుడు : జూన్ 3
ఎవరు : జి.పద్మనాభం(56)
ఎక్కడ : అమెరికా
ఎందుకు :కరోనా మహమ్మారి కారణంగా...
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్‌సీఐ) డైరెక్టర్‌కన్నుమూత
ఎప్పుడు : జూన్ 3
ఎవరు : జి.పద్మనాభం(56)
ఎక్కడ : అమెరికా
ఎందుకు :కరోనా మహమ్మారి కారణంగా...
Published date : 05 Jun 2021 06:33PM