కరోనాపై పీపుల్స్‌వార్‌ను ప్రారంభించాం: జిన్‌పింగ్
Sakshi Education
కరోనా విజృంభణ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఫిబ్రవరి 7న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు.
కరోనా రోగుల చికిత్సకు, వైరస్ కట్టడికి ‘పీపుల్స్‌వార్’ను ప్రారంభించామని ట్రంప్‌నకు వివరించారు. ఏదైనా ఒక సమస్యపై ప్రజల సహకారంతో విస్త్రుత, దీర్ఘకాలం పోరు అనే ఉద్దేశంతో ‘పీపుల్స్ వార్’ అనే సైద్ధాంతిక భావనను మావో తొలిసారి ఉపయోగించారు.
637 మంది మృతి
చైనాలో కరోనా వైరస్ బారిన పడి ఫిబ్రవరి 7న నాటికి మొత్తం 637 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 73 మంది ఫిబ్రవరి 7 తేదీనే చనిపోయారు. వారిలో వైరస్‌కు కేంద్ర బిందువుగా మారిన వుహాన్ పట్టణం ఉన్న హ్యుబయి ప్రావిన్స్ లోనే 69 మంది మృతి చెందారు. చైనా వ్యాప్తంగా వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయిన వారి సంఖ్య 31 వేలకు చేరుకుంది. ప్రస్తుతం భారత్ సహా 27 దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. భారత్‌లో మూడు సహా చైనాయేతర దేశాల్లో మొత్తం 220 కేసులు నమోదయ్యాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కరోనాపై పీపుల్స్‌వార్‌ను ప్రారంభించాం
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్
ఎందుకు : కరోనా విజృంభణ నేపథ్యంలో...

Published date : 08 Feb 2020 06:02PM