కరోనా కట్టడిలో డీఆర్‌డీవో కీలక ముందడుగు
Sakshi Education
కరోనా కట్టడికి భారత రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్‌డీవో) మరో కీలక ఉత్పత్తులను తీసుకొచ్చింది.
ఆటోమేటిక్ మిస్ట్-బేస్డ్ శానిటైజర్ డిస్పెన్సింగ్ యూనిట్‌తో సహా మరో రెండు ఉత్పత్తులను అభివృద్ధి చేసిందని అధికారులు ఏప్రిల్ 18న తెలిపారు. ముఖ్యంగా అతినీలలోహిత సి లైట్-బేస్డ్ శానిటైజేషన్ బాక్స్, చేతితో తాకే అవసరం లేకుండానే ఉపయోగించే యూవీసీ శానిటైజర్ క్యాబినెట్‌ను అభివృద్ధి చేసింది.
ఢిల్లీలోని సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్ ప్లోజివ్ అండ్ ఎన్విరాన్ మెంట్ సేఫ్టీ సంస్థతో కలిసి అల్ట్రాసోనిక్ సెన్సార్ ద్వారా పనిచేసే ఆటోమేటిక్ మిస్ట్-బేస్డ్ శానిటైజర్ డిస్పెన్సింగ్ యూనిట్‌ను డీఆర్‌డీవో అభివృద్ధి చేసింది. దీంతోపాటు ఢిల్లీలోని డిఫెన్స్ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్ (డిపాస్) ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ తో కలిసి అతినీలలోహిత సి లైట్-బేస్డ్ శానిటైజేషన్ బాక్స్ యూవీ-సీ(254 నానోమీటర్ల తరంగదైర్ఘ్యం)ని రూపొందించింది. తద్వారా రసాయనాలను ఉపయోగించి శుభ్రపరచలేని ఏ వస్తువునైనా శుభ్రపరచడానికి ఇది ఉపయోగ పడుతుంది. చెక్కులు, పాస్‌బుక్‌లు, పేపర్ కవర్లులాంటి రోజవారీ వినియోగించే వస్తువుల నుంచి కరోనా వ్యాపించకుండా నిరోధించవచ్చు. ఈ కిరణాలు కరోనా వైరస్ లోనిని జన్యు పదార్ధాలను నాశనం చేయడంలో, పునరుత్పత్తిని నిరోధిచండంలో చాలా బాగా పనిచేస్తాయిని డీఆర్‌డీవో తెలిపింది.

Published date : 20 Apr 2020 06:41PM