క్రికెట్‌కు వసీం జాఫర్ వీడ్కోలు
Sakshi Education
దేశవాళీ క్రికెట్ దిగ్గజం వసీం జాఫర్ ఆటకు వీడ్కోలు పలికాడు. అన్ని స్థాయిల క్రికెట్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు మార్చి 7న 42 ఏళ్ల జాఫర్ ప్రకటించాడు.
రంజీ ట్రోఫీలో అత్యధిక మ్యాచ్‌లు (156), పరుగులు (12,038), సెంచరీలు (40), క్యాచ్‌లు (200) అతడివే. ఓవరాల్‌గా అత్యధిక ఫస్ట్ క్లాస్ పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో జాఫర్‌ది (19,410) ఐదో స్థానం. భారత్ తరఫున 31 టెస్టుల్లో 34.10 సగటుతో జాఫర్ 1,944 పరుగులు చేశాడు. వీటిలో వెస్టిండీస్‌లో, పాకిస్థాన్‌లో చేసిన రెండు డబుల్ సెంచరీలతో పాటు దక్షిణాఫ్రికాలో చేసిన సెంచరీ అతని అత్యుత్తమ ప్రదర్శనలు. జాఫర్ 2 వన్డేలు కూడా ఆడాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : క్రికెట్‌కు వీడ్కోలు
ఎప్పుడు : మార్చి 7
ఎవరు : వసీం జాఫర్
క్విక్ రివ్యూ :
ఏమిటి : క్రికెట్‌కు వీడ్కోలు
ఎప్పుడు : మార్చి 7
ఎవరు : వసీం జాఫర్
Published date : 10 Mar 2020 06:57PM