కోవిడ్ సీజనల్ వ్యాధిగా మారే అవకాశం: ఐరాస
Sakshi Education
కోవిడ్–19 ఇకపై సీజనల్ వ్యాధిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి(యూఎన్) ఆందోళన వ్యక్తం చేసింది.
వాతావరణ పరిస్థితుల ఆధారంగా కరోనా సడలింపులు ఇవ్వొద్దని ప్రపంచ దేశాలకు హితవు పలికింది. కరోనా వ్యాప్తికి వాతావరణ పరిస్థితులు, గాలిలో నాణ్యత వంటి అంశాలు ఎలా ప్రేరేపిస్తున్నాయనే దిశగా యూఎన్‌కి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ ఏర్పాటు చేసిన 16 మంది సభ్యుల బృందం అధ్యయనం నిర్వహించింది. వీరి అధ్యయనంలో ఈ వైరస్ సీజనల్ వ్యాధిగా మారే ప్రమాదముందని తేలింది. ఈ అధ్యయన బృందానికి జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీకి శాస్త్రవేత్త బెన్ జెయిట్‌చిక్ నేతృత్వం వహించారు.
Published date : 20 Mar 2021 03:46PM