కోవిడ్ బాధితుల కోసం వార్డ్‌బోట్ తయారు
Sakshi Education
కోవిడ్–19 బాధితులకు సేవలందించేందుకు పంజాబ్‌లోని రోపార్‌లో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) శాస్త్రవేత్తలు ప్రత్యేక రోబోట్‌ను తయారు చేశారు.
రెండు గంటల్లోనే కరోనా పరీక్ష
తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలోనే కరోనా నిర్ధారణ పరీక్ష చేసే డయాగ్నొస్టిక్ కిట్‌ను కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని శ్రీచిత్ర తిరుణాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చేసిందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్థన్ చెప్పారు. ఈ కిట్‌తో కేవలం 2 గంటల్లోనే ఫలితం తెలుసుకోవచ్చని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఒక యంత్రంపై ఒకేసారి 30 నమూనాలను పరీక్షించవచ్చని వివరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కోవిడ్ బాధితుల కోసం వార్డ్‌బోట్ తయారు
ఎప్పుడు : ఏప్రిల్ 17
ఎవరు : ఐఐటీ రోపార్
ఎందుకు : కోవిడ్–19 బాధితులకు సేవలందించేందుకు
ఆసుపత్రుల్లో వార్డ్‌బోట్‌ల వాడకం ద్వారా వైద్యసిబ్బంది వైరస్ బారిన పడటాన్ని తగ్గించవచ్చునని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇవి రోగులకు మందులు, ఆహారం అందివ్వగలవని అసోసియేట్ ప్రొఫెసర్ ఎక్తా సింగ్లా తెలిపారు. ఇవి చేతులు ఊపడం వంటి సంజ్ఞలను అర్థం చేసుకోగలవని వివరించారు. కంట్రోల్ రూం ద్వారా ఏకకాలంలో వేర్వేరు వార్డుల్లోని రోబోలను నియంత్రించడం, ఆదేశాలివ్వడం సాధ్యమని... తరచూ తనని తాను శానిటైజర్ ద్వారా శుభ్రం చేసుకోవడం వార్డుబోట్‌కు ఉన్న మరో ప్రత్యేకత అని తెలిపారు.
రెండు గంటల్లోనే కరోనా పరీక్ష
తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలోనే కరోనా నిర్ధారణ పరీక్ష చేసే డయాగ్నొస్టిక్ కిట్‌ను కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని శ్రీచిత్ర తిరుణాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చేసిందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్థన్ చెప్పారు. ఈ కిట్‌తో కేవలం 2 గంటల్లోనే ఫలితం తెలుసుకోవచ్చని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఒక యంత్రంపై ఒకేసారి 30 నమూనాలను పరీక్షించవచ్చని వివరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కోవిడ్ బాధితుల కోసం వార్డ్‌బోట్ తయారు
ఎప్పుడు : ఏప్రిల్ 17
ఎవరు : ఐఐటీ రోపార్
ఎందుకు : కోవిడ్–19 బాధితులకు సేవలందించేందుకు
Published date : 18 Apr 2020 06:28PM