కోవిడ్ 19 కట్టడికి 100 కోట్లు కేటాయింపు
Sakshi Education
తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించిన కోవిడ్19 మహమ్మారి మరింత విస్తరించకుండా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
వైరస్ వ్యాప్తిని నివారించేందుకు రూ.100 కోట్లు కేటాయించినట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మార్చి 3న వెల్లడించారు. హైదరాబాద్‌లోని గాంధీ, ఫీవర్, చెస్ట్ ఆస్పత్రులు, కంటోన్మెంట్‌లోని మిలిటరీ ఆస్పత్రితోపాటు వికారాబాద్‌లోని టీబీ ఆస్పత్రిలోనూ ప్రత్యేక వార్డులను సిద్ధం చేసినట్లు చెప్పారు. అలాగే హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న ప్రైవేటు మెడికల్ అనుబంధ ఆసుపత్రుల్లో 3 వేల పడకలను అందుబాటులో ఉంచాలని యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. వాటిలో కొన్నింటిని సాధారణ ఐసొలేషన్ కోసం, కొన్నింటిని ప్రత్యేక చికిత్స కోసం ముందు జాగ్రత్తగా తీసుకున్నట్లు వివరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కోవిడ్ 19 కట్టడికి 100 కోట్లు కేటాయింపు
ఎప్పుడు : మార్చి 3
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎందుకు : కోవిడ్ 19 మరింత విస్తరించకుండా చర్యలు చేపట్టేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : కోవిడ్ 19 కట్టడికి 100 కోట్లు కేటాయింపు
ఎప్పుడు : మార్చి 3
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎందుకు : కోవిడ్ 19 మరింత విస్తరించకుండా చర్యలు చేపట్టేందుకు
Published date : 04 Mar 2020 05:41PM