కిర్గిజ్‌తో పెట్టుబడుల ఒప్పందం
Sakshi Education
కిర్గిజిస్తాన్, భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచుకోవడానికి ఇరు దేశాలు అయిదేళ్ల మార్గదర్శ ప్రణాళికలను రూపొందించుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్‌లో జూన్ 14న జరిగిన భారత్- కిర్గిజ్ బిజినెస్ ఫోరం సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు తెలిపారు. అలాగే, ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందం (డీటీఏఏ), ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందానికి తుది రూపు కూడా ఇచ్చినట్లు వెల్లడించారు.
మరోవైపు కిర్గిజిస్థాన్ అధ్యక్షుడు సూరోన్‌బే జీన్‌బెకోవ్‌తో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ దేశానికి రూ.1400 కోట్లు (200 మిలియన్ డాలర్లు) రుణంగా ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా రెండు దేశాలు 15 ఒప్పందాలపై సంతకాలు చేశాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కిర్గిజిస్తాన్‌తో పెట్టుబడుల ఒప్పందం
ఎప్పుడు : జూన్ 14
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : బిష్కెక్, కిర్గిజిస్తాన్

Published date : 15 Jun 2019 06:16PM