Skip to main content

కేంద్రం ప్రారంభించిన నిపుణ్‌ భారత్‌ కార్యక్రమం ఉద్దేశం?

దేశంలో సమగ్ర విద్య, అక్షరాస్యత ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ‘‘నిపుణ్‌ భారత్‌–2021 కార్యక్రమం’’ ప్రారంభమైంది.
Current Affairs జాతీయ విద్యావిధానం –2020 అమలులో భాగంగా సిద్ధం చేసిన ఈ కార్యక్రమాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ జూలై 5న ప్రారంభించారు. నిపుణ్‌ భారత్‌కు సంబంధించిన చిన్న వీడియో, ఒక గీతం, మార్గదర్శకాలను ఢిల్లీ నుంచి వర్చువల్‌ మోడ్‌లో విడుదల చేశారు.

సమగ్ర శిక్ష అభియాన్‌ ఆధ్వర్యంలో..
  • నిపుణ్‌ భారత్‌ కార్యక్రమాన్ని రాష్ట్రాల్లోని పాఠశాల విద్యా శాఖలు ఐదు దశల్లో అమలు చేయనున్నాయి.
  • అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో సమగ్ర శిక్ష అభియాన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
  • 2026–27 సంవత్సరం నాటికి, ప్రతి బిడ్డ 3వ తరగతి పూర్తిచేసి చదవడం, రాయడంతో పాటు అంకగణితంలో కావలసిన అభ్యాస సామర్థ్యాన్ని సాధించే లక్ష్యంగా దీన్ని చేపట్టారు.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : నిపుణ్‌ భారత్‌–2021 కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : జూలై 5
ఎవరు : కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌
ఎందుకు : దేశంలో సమగ్ర విద్య, అక్షరాస్యత ప్రమాణాలను మెరుగుపరిచేందుకు...
Published date : 06 Jul 2021 06:31PM

Photo Stories