Skip to main content

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ - వివరాలు

భారీ మెజారిటీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తరువాత తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన బృందంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. అనూహ్య మార్పులు, భారీ చేర్పులతో కేబినెట్‌ను తీర్చిదిద్దారు. యూపీ సహా పలు రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న ఎన్నికలు, సామాజిక సమీకరణాలు, పనితీరు, సంస్థాగత అవసరాలు ప్రాతిపదికగా భారీ కసరత్తు అనంతరం మొత్తం 77 మంది మంత్రులతో సరికొత్త మంత్రి మండలిని కొలువుదీర్చారు. ప్రధానితో కలిపి మంత్రుల సంఖ్య 78 కి చేరగా, గరిష్టంగా 81 మంది వరకు మంత్రులుగా ఉండవచ్చు. మొత్తం 15 మంది కేబినెట్‌ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులుగా జూలై 7న రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు.

Current Affairs


ముఖ్యమైన అంశాలు...
  • వివిధ కారణాలతో వైద్య, విద్యా శాఖల మంత్రులు డాక్టర్‌ హర్షవర్థ్దన్, రమేష్‌ నిశాంక్‌ పోఖ్రియాల్‌ సహా మొత్తం 12 మందిని మంత్రివర్గం నుంచి తప్పించారు. వీరి రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముందే ఆమోదించారు.
  • పలువురు జూనియర్లకు సీనియర్లుగా ప్రమోషన్‌ ఇచ్చి కేబినెట్‌ హోదా కల్పించారు.
  • జూలై 7న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఏడుగురు మహిళలు సహా మొత్తం 43 మంది ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 36 మంది కొత్త వారు కాగా.. ఇప్పటికే స్వతంత్ర, సహాయ మంత్రులుగా ఉన్న ఏడుగురు కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు.
  • తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న జి.కిషన్‌రెడ్డికి కేబినెట్‌ ర్యాంక్‌తో పదోన్నతి లభించింది.
  • ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపీలో కేబినెట్‌ మంత్రిగా పనిచేసిన నేతల్లో ఎం.వెంకయ్యనాయుడు తరువాత కిషన్‌రెడ్డి రెండో తెలుగు వ్యక్తి కావడం విశేషం.
  • కొత్తగా ప్రమాణం చేసిన వారిలో 9 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు.
  • కొత్తగా పలువురు మహిళల చేరికతో మంత్రివర్గంలో మహిళల సంఖ్య 11కి చేరింది.
  • తాజా మంత్రి వర్గ విస్తరణలో పిన్న వయస్కుడైన నిశిత్‌ ప్రామానిక్‌కు యువజన, క్రీడల వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బాధ్యతలు కూడా అప్పగించారు.
  • తమిళనాడుకు చెందిన ప్రస్తుతం ఎల్‌ మురుగన్‌ ఏ సభలోనూ సభ్యుడిగా లేరు. ఆయనను పుదుచ్చేరి నుంచి రాజ్యసభకు పంపించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

పదోన్నతి వీరికే...
స్వతంత్ర హోదాలో క్రీడల శాఖ మంత్రిగా ఉన్న కిరెణ్‌ రిజిజు, విద్యుత్తు శాఖ మంత్రిగా ఉన్న ఆర్కే సింగ్, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిగా ఉన్న హర్దీప్‌సింగ్‌ పూరి, షిప్పింగ్‌ శాఖ మంత్రిగా ఉన్న మన్‌సుఖ్‌ ఎల్‌.మాండవీయలకు కేబినెట్‌ ర్యాంకు లభించింది. హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న గంగాపురం కిషన్‌రెడ్డికి, ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ఉన్న అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌కు, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా ఉన్న పర్షోత్తమ్‌ రుపాలాకు కేబినెట్‌ హోదా దక్కింది.

పదవి కోల్పోయిన మంత్రులు...
కేంద్ర కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణలో భాగంగా... వివిధ కారణాల రీత్యా పదవి కోల్పోయిన వారిలో ఆరుగురు కేబినెట్‌ మంత్రులు, ఆరుగురు సహాయమంత్రులు ఉన్నారు. వారి వివరాలు ఇలా...
  • సామాజిక న్యాయశాఖ మంత్రి తావర్‌చంద్‌ గెహ్లాట్‌(కేబినేట్‌ హోదా)
  • ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌(కేబినేట్‌ హోదా)
  • రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డి.వి.సదానంద గౌడ(కేబినేట్‌ హోదా)
  • కేంద్ర న్యాయ, ఐటీ కమ్యూనికేషన్స్‌ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌(కేబినేట్‌ హోదా)
  • విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌(కేబినేట్‌ హోదా)
  • పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌(కేబినేట్‌ హోదా)
  • కార్మిక శాఖ సహాయ మంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌(స్వతంత్ర హోదా)
  • మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి దేబోశ్రీ చౌదరి
  • మానవ వనరులు, కమ్యూనికేషన్, ఐటీ శాఖ సహాయ మంత్రి సంజయ్‌ ధోత్రే
  • నీటి వనరులు, సాంఘిక న్యాయం, సాధికారత సహాయ మంత్రి రతన్‌లాల్‌ కటారియా
  • మధ్య, చిన్న తరహా పరిశ్రమలు, పాడి పశుగణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌ సారంగీ
  • అటవీ పర్యావరణ శాఖ సహాయ మంత్రి బాబుల్‌ సుప్రియో

పునర్‌ వ్యవస్థీకరణ తర్వాత మంత్రివర్గ రూపం ఇలా..

మంత్రులు

శాఖల వివరాలు

కేబినెట్‌ మంత్రులు

1. నరేంద్ర మోదీ

ప్రధాన మంత్రి, సిబ్బంది, ప్రజా నివేదనలు, పెన్షన్ల శాఖ; అణు ఇంధన శాఖ; అంతరిక్ష విభాగం; మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు

2. రాజ్‌ నాథ్‌ సింగ్‌

రక్షణ శాఖ

3. అమిత్‌ షా

హోం శాఖ, సహకార శాఖ

4. నితిన్‌ గడ్కరీ

రోడ్డు రవాణా, రహదారులు

5. నిర్మలా సీతారామన్‌

ఆర్థిక శాఖ, కార్పొరేట్‌ వ్యవహారాలు

6. నరేంద్ర సింగ్‌ తోమర్‌

వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ

7. జైశంకర్‌

విదేశాంగ వ్యవహారాలు

8. అర్జున్‌ ముండా

గిరిజన వ్యవహారాలు

9. స్మృతీ ఇరానీ

మహిళా, శిశు అభివృద్ధి శాఖ

10. పీయూష్‌ గోయల్‌

వాణిజ్య, పరిశ్రమల శాఖ, ఆహార ప్రజా పంపిణీ శాఖ, జౌళి శాఖ

11.ధర్మేంద్ర ప్రధాన్‌

విద్యాశాఖ మంత్రి; నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత శాఖ

12. ప్రహ్లాద్‌ జోషి

పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు శాఖ, గనుల శాఖ

13. నారాయణ్‌ రాణే

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ

14. శర్భానంద సోనోవాల్‌

ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ, ఆయుష్‌ శాఖ

15. ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ

మైనారిటీ వ్యవహారాలు

16. డాక్టర్‌ వీరేంద్ర కుమార్‌

సామాజిక న్యాయం, సాధికారత శాఖ

17. గిరిరాజ్‌ సింగ్‌

గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ

18. జ్యోతిరాదిత్య సింధియా

పౌర విమానయాన శాఖ

19. రామ్‌చంద్ర ప్రసాద్‌ సింగ్‌

ఉక్కు శాఖ

20. అశ్విని వైష్ణవ్‌

రైల్వే శాఖ; కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ

21. పశుపతి కుమార్‌ పారస్‌

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ

22. గజేంద్ర సింగ్‌ షెఖావత్‌

జల్‌ శక్తి

23. కిరెన్‌ రిజిజు

న్యాయ శాఖ

24. రాజ్‌ కుమార్‌ సింగ్‌

విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ

25. హర్దీప్‌ సింగ్‌ పూరి

పెట్రోలియం, సహజ వాయువు, గృహ, పట్టణ వ్యవహారాలు

26. మన్సుఖ్‌ మాండవియా

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, రసాయనాలు, ఎరువుల శాఖ

27. భూపేందర్‌ యాదవ్‌

పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ, కార్మిక , ఉపాధి శాఖ

28. మహేంద్ర నాథ్‌ పాండే

భారీ పరిశ్రమలు

29. పురుషోత్తం రూపాల

మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ

30. జి.కిషన్‌ రెడ్డి

సాంస్కృతిక శాఖ, పర్యాటకం, ఈశాన్య ప్రాంత అభివృద్ధి

31. అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌

సమాచార, ప్రసార శాఖ, యువజన వ్యవహారాలు, క్రీడలు

సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా)

1. రావు ఇందర్‌జిత్‌ సింగ్‌

గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ (స్వతంత్ర హోదా); ప్రణాళిక మంత్రిత్వ శాఖ (స్వతంత్ర ఛార్జ్‌); కార్పొరేట్‌ వ్యవహారాలు సహాయ మంత్రి

2. డాక్టర్‌ జితేంద్ర సింగ్‌

సైన్స్ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఇండిపెండెంట్‌ ఛార్జ్‌); భూమి శాస్త్ర మంత్రిత్వ శాఖ (ఇండిపెండెంట్‌ ఛార్జ్‌); పీఎంవో, డీవోపీటీ, అణు ఇంధన శాఖ, అంతరిక్ష శాఖలో సహాయ మంత్రి

సహాయ మంత్రులు

1. శ్రీపాద యశో నాయక్‌

ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గ మంత్రిత్వ శాఖ, పర్యాటక మంత్రిత్వ శాఖ

2. ఫగన్‌సింగ్‌ కులస్తే

ఉక్కు మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

3. ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌

జల్‌ శక్తి, ఫుడ్‌ ప్రాసెసింగ్,

4. అశ్విని కుమార్‌ చౌబే

వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ; పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ

5. అర్జున్‌ మేఘవాల్‌

పార్లమెంటరీ వ్యవహారాలు,

6. వీకే సింగ్‌

రహదారులు, పౌర విమానయానం

7. క్రిషన్‌ పాల్‌

విద్యుత్, భారీ పరిశ్రమలు

8. దాన్వే రావ్‌సాహెబ్‌

రైల్వే శాఖ, బొగ్గు శాఖ, గనుల శాఖ

9. రామ్‌దాస్‌ అథవాలే

సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ

10. సాధ్వీ నిరంజన్‌ జ్యోతి

వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ, గ్రామీణాభివృద్ధి

11. సంజీవ్‌ బాల్యాన్‌

మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ

12. నిత్యానంద్‌ రాయ్‌

హోం శాఖ

13. పంకజ్‌ చౌదరి

ఆర్థిక శాఖ

14. అనుప్రియా సింగ్‌ పటేల్‌

వాణిజ్యం, పరిశ్రమలు

15. ప్రొఫెసర్‌ ఎస్పీ సింగ్‌ భగెల్‌

న్యాయ శాఖ

16. రాజీవ్‌ చంద్రశేఖర్‌

నైపుణ్య అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ

17. శోభా కరంద్లాజే

వ్యవసాయ, రైతు సంక్షేమం

18. భాను ప్రతాప్‌

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు

19. దర్శన విక్రమ్‌ జర్దోష్‌

వస్త్ర మంత్రిత్వ శాఖ, రైల్వే

20. వి. మురళీధరన్‌

విదేశాంగ శాఖ

21. మీనాక్షి లేఖి

సాంస్కృతిక శాఖ

22. సోమ్‌ ప్రకాష్‌

వాణిజ్యం, పరిశ్రమలు

23. రేణుకా సింగ్‌ సారుత

గిరిజన వ్యవహారాలు

24. రామేశ్వర్‌ తేలి

పెట్రోలియం, సహజ వాయువు,

25. కైలాష్‌ చౌదరి

వ్యవసాయ, రైతు సంక్షేమం

26. అన్నపూర్ణ దేవి

విద్యా శాఖ

27. ఎ.నారాయణస్వామి

సామాజిక న్యాయం, సాధికారత

28. కౌషల్‌ కిషోర్‌

గృహ, పట్టణ వ్యవహారాలు

29. అజయ్‌ భట్‌

రక్షణ, పర్యాటకం

30. బీఎల్‌ వర్మ

ఈశాన్య ప్రాంత అభివృద్ధి

31. అజయ్‌ కుమార్‌

హోం శాఖ

32. దేవుసింగ్‌ చౌహాన్‌

కమ్యూనికేషన్స్‌

33. భగవంత్‌ ఖూబా

పునరుత్పాదక ఇంధన శాఖ,

34. కపిల్‌ మోరేశ్వర్‌ పాటిల్‌

పంచాయతీ రాజ్‌

35. ప్రతిమా భూమిక్‌

సామాజిక న్యాయం, సాధికారత

36. సుభాస్‌ సర్కార్‌

విద్యా శాఖ

37. భగవత్‌ కిషన్‌రావు కరాద్‌

ఆర్థిక శాఖ

38. రాజ్‌కుమార్‌ రంజన్‌ సింగ్‌

విదేశాంగ, విద్యా శాఖ

39. భారతి ప్రవీణ్‌ పవార్‌

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ

40. బిశ్వేశ్వర్‌ తూడూ

గిరిజన వ్యవహారాలు, జల్‌ శక్తి

41. శాంతను ఠాకూర్‌

ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గం

42. మహేంద్రభాయి

మహిళా, శిశు, ఆయుష్‌ శాఖలు

43. జాన్‌ బర్లా

మైనారిటీ వ్యవహారాలు

44. ఎల్‌. మురుగన్‌

మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, సమాచార, ప్రసార శాఖ

45. నిశిత్‌ ప్రామానిక్‌

హోం, క్రీడలు

Published date : 08 Jul 2021 03:47PM

Photo Stories