కేంద్ర కేబినెట్ ఆమోదించిన స్టార్స్ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం?
Sakshi Education
ప్రాథమిక విద్య మొదలుకొని విశ్వవిద్యాలయ విద్య వరకూ అన్ని స్థాయిల్లోనూ విస్తృతమైన సంస్కరణలు తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) కింద ‘స్టార్స్’ ప్రాజెక్టుకి కేంద్ర కేబినెట్ అక్టోబర్ 14న ఆమోదముద్ర వేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్ట్రెంథెనింగ్ టీచింగ్ లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్స్ (స్టార్స్) ప్రాజెక్టుకి ఆమోదం
ఎప్పుడు : అక్టోబర్ 14
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : వివిధ రాష్ట్రాల్లో విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడం, ఉపాధ్యాయుల నాణ్యతా ప్రమాణాలను పెంచి పాఠశాలలు మంచి ఫలితాలు రాబట్టేందుకు
ఎన్‌ఈపీ అమలులో భాగంగా ‘స్ట్రెంథెనింగ్ టీచింగ్ లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్స్ (స్టార్స్)’ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.
స్టార్స్ ముఖ్య ఉద్దేశం...
వివిధ రాష్ట్రాల్లో విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడం, ఉపాధ్యాయుల నాణ్యతా ప్రమాణాలను పెంచి పాఠశాలలు మంచి ఫలితాలు రాబట్టేలా చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.
ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయం....
ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో సమావేశమైన మంత్రి మండలి స్టార్స్ ప్రాజెక్టుకి ఆమోద ముద్ర వేసినట్టు కేంద్ర పర్యావరణం, అటవీ, భారీ పరిశ్రమలు, సమాచార, ప్రసార శాఖల మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. మంత్రి తెలిపిన వివరాల ప్రకారం...
- రూ.5,718 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన స్టార్స్ ప్రాజెక్టుకి ప్రపంచ బ్యాంకు రూ.3,700 కోట్ల ఆర్థిక సాయం అందిస్తోంది.
- చదువు అంటే బట్టీ పట్టి రాయడం కాకుండా సబ్జెక్టులపై అవగాహన పెంచుకుంటూ నేర్చుకోవడం అన్న ప్రాతిపదికపైన ఈ విధానాన్ని తీర్చి దిద్దారు.
- విద్యార్థులపై మార్కుల ఒత్తిడి లేకుండా బోధనా పద్ధతుల్లో సమూల మార్పులు తీసుకు రావడం కోసం ఈ స్టార్స్ ప్రాజెక్టుని ప్రారంభించనున్నారు.
- హిమాచల్‌ప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, ఒడిశాల్లో విద్యా రంగంలో నాణ్యత పెంచడానికి తొలుత కృషి చేయనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్ట్రెంథెనింగ్ టీచింగ్ లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్స్ (స్టార్స్) ప్రాజెక్టుకి ఆమోదం
ఎప్పుడు : అక్టోబర్ 14
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : వివిధ రాష్ట్రాల్లో విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడం, ఉపాధ్యాయుల నాణ్యతా ప్రమాణాలను పెంచి పాఠశాలలు మంచి ఫలితాలు రాబట్టేందుకు
Published date : 15 Oct 2020 05:06PM