Skip to main content

కేంద్ర బడ్జెట్‌ 2020–21 హైలైట్స్‌

2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టారు. నరేంద్ర మోదీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్‌ ఇది. లోక్‌సభలో రెండున్నర గంటలకుపైగా బడ్జెట్‌ ప్రసంగం చేసిన నిర్మలా సీతారామన్ .. గ్రామీణ, వ్యవసాయరంగాలకు పెద్ద పీట వేశారు. ఆదాయపన్ను చెల్లింపులో పలు మార్పులు తీసుకొచ్చారు. మధ్య, ఎగువతరగతి వర్గాలకు ఊరటనిచ్చేలా వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లలో మార్పులు చేశారు.
Current Affairs

బడ్జెట్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

  • ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతాం
  • ప్రజల ఆదాయాలను మెరుగుపరచడమే బడ్జెట్‌ లక్ష్యం
  • ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్‌
  • ప్రజల్లో కొనుగోలు శక్తిని ముమ్మరం చేస్తాం
  • దివంగత నేత అరుణ్‌ జైట్లీని గుర్తుచేసిన నిర్మల

అందరికీ ఇళ్లు
  • సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అందడం లేదు
  • రూపాయిలో 15పైసలు మాత్రమే లబ్ధిదారులకు చేరుతున్నాయి
  • ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన ద్వారా అందరికీ ఇళ్లు మంజూరు చేస్తాం
  • భారత్‌లో ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయి

జీఎస్టీ చరిత్రాత్మకమైనది
  • దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నాయి
  • ఈ బడ్జెట్‌ దేశ ప్రజల ఆర్థిక స్థోమతను పెంచుతుంది
  • కేంద్రం చేపట్టిన సంస్కరణల్లో జీఎస్టీ చరిత్రాత్మకమైనది
  • ఆర్థిక సంస్కరణల్లో జీఎస్టీ కీలకమైనది

అదుపులో ద్రవ్యోల్బణం
  • ఎకానమీని సంఘటితపరిచేందుకు చర్యలు
  • ఆరోగ్యకరమైన వాణిజ్య వృద్ధికి తోడ్పాటు
  • ప్రభుత్వం విస్తృత సంస్కరణలు చేపట్టింది
  • ద్రవ్యోల్బణం అదుపులో ఉంది
  • జీఎస్టీతో సామాన్యులకు నెలకు 4 శాతం వరకూ ఆదా


కవితను చదివి వినిపించిన నిర్మల

నా దేశం దాల్‌ సరస్సులో విరబూసిన కమలం లాంటిది

మానవత్వం, దయతో కూడిన సమాజం అవసరం

నా దేశం సైనికుల నరాల్లో ప్రవహిస్తున్న ఉడుకు రక్తం

మా దేశం వికసిస్తున్న షాలిమార్‌ తోటలాంటిది

  • జీఎస్టీ శ్లాబుల తగ్గింపుతో సామాన్యులకు మేలు
  • జీఎస్టీతో పన్ను వ్యవస్థలోకి కొత్తగా 60 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు
  • రూ లక్ష కోట‍్ల వరకూ జీఎస్టీ ప్రయోజనాలు సామాన్యులకు మళ్లింపు
  • 40 కోట్ల జీఎస్టీ రిటర్నులు దాఖలయ్యాయి
  • జీఎస్టీ సమస్యల పరిష్కారానికి జీఎస్టీ మండలి చొరవ
  • జీఎస్టీ శ్లాబుల తగ్గింపుతో సామాన్యులకు మేలు జరిగింది
  • జీఎస్టీ అమలు తర్వాత సామాన్యుల ఖర్చులు 4శాతం వరకు ఆదా అయ్యాయి

రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం
  • 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడం బడ్జెట్‌ లక్ష్యం
  • రైతు సంక్షేమానికి 16 కార్యాచరణ ప్రణాళికలు
  • 100 కరువు జిల్లాలకు తాగునీరు అందించే పథకాలు
  • 26 లక్షల మంది రైతులకు సోలార్‌ పంపు సెట్లు
  • పేదరికం నుంచి 27 కోట్లమందిని బయటకు తెచ్చాం
  • ఇక నుంచి ఇన్‌కం టాక్స్‌ రిటర్న్‌ల ఫైలింగ్‌ మరింత సులభతరం చేస్తాం
  • ఆరు కోట్ల 11 లక్షల మందికి ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన

మా ప్రాధాన్యతా అంశాలు ఇవే
  • తొలి ప్రాధాన్యం : వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి
  • ద్వితీయ ప్రాధాన్యాంశం : ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు
  • మూడో ప్రాధాన్యాంశం : విద్య, చిన్నారుల సంక్షేమం

ఆన్‌లైన్‌లో ఆర్గానిక్‌ ఉత్పత్తులు
  • 16 లక్షలమంది రైతులకు గ్రిడ్‌ అనుసంధానిత సోలార్‌ విద్యుత్‌
  • సేంద్రియ సాగుచేసే రైతులకు మరిన్ని ప్రోత్సహకాలు
  • ఈ సారి బడ్జెట్‌ మూడు రంగాల వృద్ధికి ఊతమివ్వనుంది
  • ఒకటి ఆరోగ్యం, రెండోది విద్య, మూడోది ఉద్యోగ కల్పన
  • రైతుల సౌకర్యార్థం రిఫ్రిజిలేటర్‌తో కూడిన కిసాన్‌ రైలు ఏర్పాటు
  • సివిల్‌ ఏవియేషన్‌ ద్వారా కూరగాయల సరఫరాకు కృషి ఉదాన్‌ పథకం
  • జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫామింగ్‌కు చేయూత
  • ఆన్‌లైన్‌లో ఆర్గానిక్‌ ఉత్పత్తుల విక్రయం

గ్రామీణ మహిళలకు ధాన్యలక్ష్మి
  • ముద్ర స్కీమ్‌ ద్వారా గ్రామీణ మహిళలకు సాయం
  • గ్రామీణ మహిళలకు ధాన్యలక్ష్మి పేరుతో నూతన స్కీం
  • నాబార్డు ద్వారా రీఫైనాన్స్‌ పునరుద్ధరిస్తాం


బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్దపీట
  • రూ 15 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు
  • వ్యవసాయ, గ్రామీణాభివృద్ధికి రూ 2.83 లక్షల కోట్లు
  • పంచాయితీరాజ్‌కు రూ 1.23 లక్షల కోట్లు
  • ఆరోగ్య రంగానికి రూ 69,000 కోట్లు
  • స్వచ్ఛభారత్‌ మిషన్‌కు రూ 12,300 కోట్లు
  • పైప్‌డ్‌ వాటర్‌ ప్రాజెక్టుకు రూ 3.6 లక్షల కోట్లు

రంగాలవారీగా కేటాయింపులివే..
  • జల్‌జీవన్‌ మిషన్‌కు రూ 11,500 కోట్లు
  • విద్యారంగానికి రూ 99.300 కోట్లు
  • నైపుణ్యాభివృద్ధికి రూ 3,000 కోట్లు
  • కొత్తగా ఐదు స్మార్ట్‌ సిటీల అభివృద్ధి
  • నేషనల్‌ టెక్నికల్‌ టెక్స్‌టైల్‌ మిషన్‌ ఏర్పాటుకు రూ1480 కోట్లు
  • పరిశ్రమలు, వాణిజ్య రంగానికి రూ 27,300 కోట్లు
  • రవాణా మౌలిక సదుపాయాలకు రూ 1.7 లక్షల కోట్లు
  • సీనియర్‌ సిటిజన్ల సంక్షేమానికి రూ 9500 కోట్లు
  • టూరిజం ప్రోత్సాహానికి రూ 2500 కోట్లు
  • సాంస్కృతిక శాఖకు రూ 3150 కోట్లు

కొత్తగా ఇండస్ట్రియల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సెల్‌..
  • యువ పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి ప్రత్యేక పథకం
  • గ్లోబలైజేషన్‌కు అనుగుణంగా పరిశ్రమల అభివృద్ధి
  • ఇండస్ట్రియల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సెల్‌ ఏర్పాటు
  • ల్యాండ్‌ బ్యాంక్‌, ఇతర ప్రభుత్వ అనుమతుల కోసం ప్రత్యేక సెల్‌
  • మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి పీపీపీ విధానం
  • ఎలక్ట్రానిక్‌, మాన్యుఫాక్చరింగ్‌పై ప్రత్యేక దృష్టి
  • మొబైల్‌ తయారీ పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం

విద్యారంగంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
  • విద్యారంగంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి
  • విద్య, స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి
  • 2026నాటికి 150 వర్సిటీల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం కొత్త కోర్సులు
  • ప్రధాన యూనివర్సిటీల్లో ఆన్‌లైన్‌లో డిగ్రీ కోర్సులు
  • నేషనల్‌ పోలీస్‌, ఫోరెన్సిక్‌ యూనివర్సిటీ ప్రారంభిస్తాం
  • భారత్‌లో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థుల కోసం ఇన్సాట్‌ పరీక్షలు
  • ప్రస్తుతం ఉన్న ప్రతి జిల్లా ఆస్పత్రికి మెడికల్‌ కాలేజీ
  • సమాజంలోని అట్టడుగు వర్గాలకు ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా చర్యలు
  • నిర్మాణాత్మక చర్యలతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నాం
  • కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే దేశం వేగంగా ముందుకెళ్తుంది
  • భారత్‌ ఇప్పుడు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ
  • సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌ ఈ ప్రభుత్వ లక్ష్యం
  • ఎఫ్‌డీఐలు 284 బిలియన్‌ డాలర్లకు చేరాయి
  • వర్షాభావ జిల్లాలకు అదనపు నిధులు

 


వివాహ వయస్సు పెంపుపై టాస్క్‌ఫోర్స్‌
  • ఆడపిల్లల వివాహ వయస్సు పెంపు విషయమై టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు
  • పాఠశాల స్థాయి ఉన్నత విద్య వరకు బాలికలు ముందంజలో ఉన్నారు
  • బేటీ బచావో బేటీ పఢావో గొప్ప విజయం సాధించింది
  • ప్రాథమిక స్థాయి విద్యలో బాలుర కంటే బాలికలే ఐదు శాతం ఎక్కువ ఉన్నారు
  • ఆరు లక్షలమంది అంగన్‌వాడీలకు సెల్‌ఫోన్లు
  • పౌష్టికాహారం, హెల్త్‌కేర్‌పై ప్రత్యేక దృష్టి
  • మహిళా సంక్షేమ పథకాల రూ. 28,600 కోట్లు
  • పౌష్టికాహార పథకానికి రూ. 35.6 కోట్లు
  • పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌

కరెంటు బిల్లుల స్థానంలో స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్లు
  • చిన్న ఎగుమతిదారుల కోసం నిర్విక్‌ పథకం
  • త్వరలో జాతీయ లాజిస్టిక్స్‌ పాలసీ
  • ఇ కనుంచి యంత్రాలతో సెప్టిక్‌ ట్యాంకుల క్లినింగ్‌
  • ప్రైవేటు రంగంలో డేటా సెంటర్‌ పార్క్‌లు ఏర్పాటు
  • కరెంటు బిల్లుల స్థానంలో త్వరలో స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్లు
  • ఆప్టికల్‌ ఫైబర్‌ లింక్‌తో లక్షగ్రామపంచాయతీల అనుసంధానం

ఐదు చరిత్రాత్మక ప్రాంతాల అభివృద్ధి
  • రవాణారంగ అభివృద్ధికి బడ్జెట్‌లో కొత్త వ్యూహాలు
  • ఐదు చరిత్రాత్మక ప్రాంతాల అభివృద్ధి
  • రాంచీలో ట్రైబల్‌ మ్యూజియం
  • అహ్మదాబాద్‌లో మ్యారిటైమ్‌ మ్యూజియం
  • పర్యాటక అభివృద్ధికి తేజాస్‌ రైళ్లు
  • రైల్వేల్లో మరింత ప్రైవేటీకరణ.. పీపీపీ పద్ధతిలో 150 రైళ్లు
  • వచ్చే నాలుగేళ్లలో 100 కొత్త ఎయిర్‌పోర్ట్‌లు
  • 2023 నాటికి ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌ వే పూర్తి
  • ముంబై-అహ్మదాబాద్‌ మధ్య హైస్పీడ్‌ రైలు
  • పెద్దసంఖ్యలో తేజాస్‌ తరహా రైళ్లు, సెమీ హైస్పీడ్‌ రైళ్లు

2022లో భారత్‌లో జీ 20 సదస్సు
  • పన్ను అధికారుల వేధింపులను సహించం​
  • కొన్ని నిబంధనల ఉల్లంఘనలపై క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ తప్పించేలా కంపెనీ చట్టం సవరణ
    2022లో భారత్‌లో జీ 20 సదస్సు.. రూ 100 కోట్లతో సన్నాహక ఏర్పాట్లు

బ్యాంకుల్లో డిపాజిటర్ల సొమ్ము సురక్షితం
  • డిపాజిట్‌ భీమా పరిధి రూ లక్ష నుంచి రూ 5 లక్షలకు పెంపు
  • పన్ను అధికారుల వేధింపులను సహించం​
  • కొన్ని నిబంధనల ఉల్లంఘనలపై క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ తప్పించేలా కంపెనీ చట్టం సవరణ
  • సహకార బ్యాంకుల పరిపుష్టి
  • గిఫ్ట్‌ సిటీలో ఇంటర్నేషనల్‌ బులియన్‌ ఎక్స్ఛేంజ్‌
  • షేర్ల అమ్మకం ద్వారా ఎల్‌ఐసీలో​ప్రభుత్వ వాటా పాక్షిక విక్రయం
  • ఐడీబీఐ బ్యాంకులోని ప్రభుత్వ వాటా అమ్మకం
  • 2021లో జీడీపీ వృద్ధిరేటు పెరుగుతుందని ఆశాభావం
  • వచ్చే సంవత్సరానికి జీడీపీ వృద్ధిరేటు 10శాతం వరకు పెరుగుతుందని ఆశాభావం

కార్పొరేట్‌ ట్యాక్స్‌ 15శాతం తగ్గింపు
  • కార్పొరేట్‌ పన్నుల తగ్గింపు విప్లవాత్మక నిర్ణయం
  • ప్రపంచంలో అతితక్కువ కార్పొరేట్‌ పన్నులు ఉన్న దేశం భారత్‌
  • కొత్తగా అంతర్జాతీయ బులియన్‌ ఎక్స్చేంజ్‌ ఏర్పాటు
  • కార్పొరేట్‌ ట్యాక్స్‌ 15శాతం తగ్గింపు
  • కార్పొరేట్‌ ట్యాక్స్‌లు తగ్గించడం చరిత్రాత్మక నిర్ణయం
  • డివిడెండ్‌ డిస్ర్టిబ్యూషన్‌ ట్యాక్స్‌ రద్దు
  • బ్యాంకింగ్‌ రంగంలో మరింత పారదర్శకత రావాల్సిన అవసరముంది
  • చిన్న, మధ్యతరహా పరిశ్రమల రుణాల పునరుద్ధరణ గడువు 2021 వరకు పెంపు
  • ఫైనాన్షియల్‌ కాంట్రాక్ట్‌ల ప్రత్యేక చట్టం
  • మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం దీర్ఘకాలిక రుణాల మంజూరు

నూతన వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లు
  • మధ్య, ఎగువ మధ్యతరగతికి ఊరటనిచ్చేలా చర్యలు
  • ఆదాయపన్ను శ్లాబ్‌లు నాలుగు నుంచి ఏడుకు పెంపు
  • 0 నుంచి 2.50 లక్షల వరకు ఎలాంటి ఆదాయపన్ను లేదు
  • 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు 5 శాతం పన్ను
  • రూ. 5-7 లక్షల వార్షిక ఆదాయంపై పన్ను 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గింపు
  • రూ. 7.5 లక్షల నుంచి రూ 10 లక్షల వరకూ పన్ను 20 నుంచి 15 శాతానికి తగ్గింపు
  • రూ. 10 నుంచి రూ 12.5 లక్షల వార్షికాదాయంపై 20 శాతం పన్ను
  • రూ. 12.5 లక్షల నుంచి రూ 15 లక్షల వార్షికాదాయంపై 25 శాతం పన్ను
  • రూ. 15 లక్షల పైబడి ఆదాయంపై 30 శాతం పన్ను
Published date : 01 Feb 2020 04:13PM

Photo Stories