Skip to main content

కేబినెట్ కార్యదర్శి సిన్హా పదవీకాలం పొడిగింపు

కేబినెట్ కార్యదర్శి ప్రదీప్‌కుమార్ సిన్హా పదవీ కాలాన్ని కేంద్రప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది.
ప్రధాని మోదీ నేతృత్వంలోని నియామకాల కమిటీ జూన్ 7న ఈ మేరకు ఆమోదం తెలిపింది. సిన్హా పదవీకాలాన్ని పొడిగించడం ఇది మూడోసారి. తాజా పొడిగింపుతో గత ఏడు దశాబ్దాల్లో కేబినెట్ కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పనిచేసిన అధికారిగా సిన్హా గుర్తింపు పొందనున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
కేబినెట్ కార్యదర్శి ప్రదీప్‌కుమార్ సిన్హా పదవీ కాలం పొడిగింపు
ఎప్పుడు : జూన్ 7
ఎవరు : కేంద్రప్రభుత్వం
Published date : 08 Jun 2019 06:20PM

Photo Stories