కాటలీనాను ఈదిన తొలి తెలుగు స్విమ్మర్
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగానికి చెందిన అంతర్జాతీయ స్విమ్మర్ ఎం.తులసీ చైతన్య అమెరికాలోని కాటలీనా చానెల్‌ను ఈదాడు.
35 కిలోమీటర్ల పొడవు ఉన్న కాటలీనా చానెల్‌ను 30 ఏళ్ల చైతన్య 12 గంటల 40 నిమిషాల 24 సెకన్లలో పూర్తి చేశాడు. దీంతో ఈ చానెల్‌ను ఈదిన తొలి తెలుగు స్విమ్మర్‌గా చైతన్య గుర్తింపు పొందాడు. అలాగే ఈ ఘనత సాధించిన తొలి భారత పోలీస్ స్విమ్మర్‌గా కూడా రికార్డు నెలకొల్పాడు. చైతన్య ప్రస్తుతం విజయవాడలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
2015, 2017 ఆలిండియా పోలీస్ అక్వాటిక్స్ మీట్‌లో ‘బెస్ట్ స్విమ్మర్’ పురస్కారం పొందిన చైతన్య ఇప్పటివరకు మూడుసార్లు ప్రపంచ పోలీసు క్రీడల్లో పాల్గొని భారత్‌కు 20 పతకాలు అందించాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కాటలీనా చానెల్‌ను ఈదిన తొలి తెలుగు స్విమ్మర్
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : ఎం.తులసీ చైతన్య
ఎక్కడ : కాటలీనా చానెల్, అమెరికా

Published date : 19 Sep 2019 05:24PM