Skip to main content

కార్పొరేట్ పన్నుల భారం తగ్గిస్తూ కేంద్ర నిర్ణయానికి పార్లమెంట్ ఆమోదం

న్యూఢిల్లీ: కార్పొరేట్ పన్నుల భారం తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి డిసెంబర్ 5న పార్లమెంటు ఆమోదముద్ర పడింది.
Current Affairsఇందుకు సంబంధించి జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో తీసుకువచ్చిన ట్యాక్సేషన్ లాస్ (అమెండ్‌మెంట్) బిల్లు, 2019కు పార్లమెంటు ఓకే చెప్పింది. ఈ సందర్భంగా రాజ్యసభలో జరిగిన చర్చలో ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ మాట్లాడుతూ, కొత్తగా ఏర్పాటు చేసే తయారీ రంగ కంపెనీలకు 15 శాతం కార్పొరేట్ ట్యాక్స్ విధించే అంశంపై స్పష్టతనిచ్చారు. మైనింగ్ కంపెనీలు, సాఫ్ట్‌వేర్‌డెవలపర్లు, బుక్ ప్రింటర్లకు కొత్త తయారీ కంపెనీలకు వర్తించే ‘కనిష్ట 15 శాతం పన్ను రేటు’ వర్తించబోదని ఉద్ఘాటించారు.

ఆర్థిక వృద్ధి లక్ష్యంగా...
ఆర్థికవృద్ధే లక్ష్యంగా కార్పొరేట్ పన్నులను తగ్గించినట్లు ఆర్థికమంత్రి తెలిపారు. వృద్ధికి ఊతం ఇవ్వడం లక్ష్యంగా కేంద్రం పలు చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రభుత్వ యంత్రాంగ ంలో అలసత్వ నిరోధం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) ప్రోత్సాహం, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం వంటి పలు చర్యలు ఈ దిశలో ఉన్నాయన్నారు. కార్పొరేట్ పన్ను తగ్గింపువల్ల పెట్టుబడులకు భారత్ ఆకర్షణీయ దేశంగా అవతరిస్తోందని వివరించారు. ఆర్థికరంగం పునరుత్తేజమే ధ్యేయంగా కేంద్రం తన చర్యలను కొనసాగిస్తుందని తెలిపారు.

క్విక్ రివ్యూ:
ఏమిటి: కార్పొరేట్ పన్నుల భారం తగ్గిస్తూ కేంద్రం నిర్ణయానికి పార్లమెంట్ ఆమోదం
ఎప్పుడు: డిసెంబర్ 5, 2019
ఎవరు: ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్
ఎందుకు: కొత్తగా ఏర్పాటు చేసే తయారీ రంగ కంపెనీలకు 15 శాతం కార్పొరేట్ ట్యాక్స్ విధించే
Published date : 06 Dec 2019 06:22PM

Photo Stories