Skip to main content

కాళోజీ సాహిత్య పురస్కారం-2020 విజేత ఎవరు?

ప్రముఖ సాహితీవేత్త రామా చంద్రమౌళికి కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం-2020 లభించింది.
Current Affairs
హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సెప్టెంబర్ 9న జరిగిన కార్యక్రమంలో చంద్రమౌళికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. చంద్రమౌళికి పురస్కారం కింద రూ.లక్షా 1,116 నగదు అందించడంతోపాటు శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస గౌడ్ పాల్గొన్నారు.

స్మితా గోవింద్‌కు శిక్షక్ పురస్కార్...
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అందించే శిక్షక్ పురస్కార్ 2019-20 అవార్డు తెలంగాణ నుంచి స్మితా గోవింద్‌కు దక్కింది. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఏటా ఈ పురస్కారం ప్రదానం చేస్తారు. తెలంగాణ నుంచి బొల్లారంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో ప్రధానాచార్యులుగా పని చేస్తున్న స్మితా గోవింద్‌కు 2020 ఏడాది పురస్కారం దక్కింది. ఢిల్లీ వేదికగా జరిగిన వర్చువల్ పోగ్రాంలో కేంద్రమంత్రి రమేశ్ పొఖ్రియాల్ నుంచి స్మిత అవార్డును అందుకున్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : కాళోజీ సాహిత్య పురస్కారం-2020 విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 9
ఎవరు : ప్రముఖ సాహితీవేత్త రామా చంద్రమౌళి
Published date : 10 Sep 2020 05:08PM

Photo Stories