Skip to main content

కాళేశ్వరం, భగీరథకు ప్రతిష్టాత్మక అవార్డు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది.
సాగునీటి కల్పన లో జరుగుతున్న కృషి, పట్టణ తాగునీటి సరఫరాలో తీసుకుంటున్న చొరవకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మిషన్ భగీరథ పథకాలకు స్మార్ట్ వాటర్ అండ్ వేస్ట్ వరల్డ్ మ్యాగజైన్ (ఎస్‌డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ) ఈ అవార్డులు ప్రకటించింది. పత్రిక సంపాదక వర్గం దేశవ్యాప్తంగా సాగునీరు, వ్యర్థ జలాల శుద్ధి, పట్టణ తాగునీటి సరఫరా సంబంధిత రంగాల్లో ప్రభుత్వ రంగంలోని మొత్తం 30 ప్రాజెక్టులను పరిశీలించింది. అనంతరం ఆయా రంగాల్లో అత్యుత్తమైనవిగా పరిగణించి 11 ప్రాజెక్టులను ఈ అవార్డుకు ఎంపిక చేయగా.. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ ఉన్నాయి.

ప్రాజెక్టు సీఈగా గర్వపడుతున్నా..
ఫిబ్రవరి 19 రాత్రి చెన్నైలో ఏర్పాటు చేసిన అవార్డుల ప్రదానోత్సవంలో కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నల్లా వెంకటేశ్వర్లు అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ అవార్డు దక్కినందుకు ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్‌గా గర్వపడుతున్నానని చెప్పారు. ప్రాజెక్టును నిర్దేశిత కాలంలో పూర్తిచేసి ప్రాజెక్టు ప్రయోజనాలను ప్రజలకు అందిస్తామన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రాజెక్టు పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయని, ఈ జూన్ నెలలోనే ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోస్తామన్నారు. మిషన్ భగీరథ తరఫున అవార్డును ఈఈ రాజేశ్వరరావు స్వీకరించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : కాళేశ్వరం, భగీరథకు ఎస్‌డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అవార్డులు
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎక్కడ : చెన్నై
ఎవరు : నల్లా వెంకటేశ్వర్లు
ఎందుకు : సాగునీటి కల్పనలో జరుగుతున్న కృషికి
Published date : 21 Feb 2019 06:01PM

Photo Stories