Skip to main content

జస్టిస్ కామిరెడ్డి జయచంద్రారెడ్డి కన్నుమూత

న్యాయకోవిదుడు, సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కామిరెడ్డి జయచంద్రారెడ్డి (90) కన్నుమూశారు.
Current Affairsకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతన్న ఆయన బెంగళూరులోని తన స్వగృహంలో ఫిబ్రవరి 9న తుదిశ్వాస విడిచారు. వైఎస్సార్ జిల్లా సుండుపల్లి మండలం తిమ్మసముద్రం గ్రామం వండ్లపల్లెకు చెందిన కామిరెడ్డి క్రిష్ణారెడ్డి, చెన్నమ్మ దంపతులకు జయచంద్రారెడ్డి 1929లో జన్మించారు.

జయచంద్రారెడ్డి ప్రస్థానం ఇలా..
  • 1951లో మద్రాసు లా కళాశాలలో న్యాయశాస్త్రంలో పట్టాను పొందారు.
  • 1952లో మద్రాసు హైకోర్టులో సీనియర్ న్యాయవాది బసిరెడ్డి దగ్గర క్రిమినల్ లాయర్‌గా ఆయన న్యాయవాద ప్రస్థానాన్ని ప్రారంభించారు.
  • 1956లో ఆంధ్ర రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాదుకు మకాం మార్చి హైకోర్టు న్యాయవాదిగా కొనసాగారు.
  • 1956లోనే హైకోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) పనిచేశారు.
  • 1965-70లలో హైకోర్టు ప్రిన్సిపల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కొనసాగారు.
  • 1975లో అడిషనల్ హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపికై న ఆయన అనేక హోదాలలో పనిచేస్తూ 1976లో పర్మినెంట్ న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
  • 1979-80లలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికై అనేక హోదాల్లో పనిచేశారు.
  • 1995-97 14వ లా కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలను నిర్వర్తించారు.
  • 2001-2005 వరకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా ఆయన సేవలను అందించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
న్యాయకోవిదుడు, సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి కన్నుమూత
ఎప్పుడు : ఫిబ్రవరి 9
ఎవరు : జస్టిస్ కామిరెడ్డి జయచంద్రారెడ్డి (90)
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
ఎందుకు : అనారోగ్యం కారణంగా
Published date : 10 Feb 2020 05:51PM

Photo Stories