Skip to main content

జస్టిస్‌ జాస్తి ఈశ్వర్‌ప్రసాద్‌ కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి ఈశ్వర్‌ ప్రసాద్‌(87) గుండెపోటుతో జూలై 6న హైదరాబద్‌లోని తన స్వగృహంలో కన్నుమూశారు.
Current Affairs
1934, ఆగస్టు 4న మద్రాస్‌లో న్యాయవాద కుటుంబంలో జన్మించిన జస్టిస్‌ ఈశ్వర్‌ప్రసాద్‌... 1990 నుంచి 1994 వరకు ఉమ్మడి హైకోర్టు జడ్జిగా సేవలందించారు. 1994 నుంచి 1996 వరకు కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. అలాగే జనవరి 1997 నుంచి మార్చి 1997 వరకు స్పెషల్‌ కోర్డు చైర్మన్‌ విధులు నిర్వహించారు. తర్వాత అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ చైర్మన్‌గా పనిచేసి 2003 మార్చిలో పదవీవిరమణ పొందారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి కన్నుమూత
ఎప్పుడు : జూలై 6
ఎవరు : జస్టిస్‌ జాస్తి ఈశ్వర్‌ ప్రసాద్‌(87)
ఎక్కడ : హైదరాబాద్‌
ఎందుకు : గుండెపోటు కారణంగా...
Published date : 07 Jul 2021 05:36PM

Photo Stories