Daily Current Affairs in Telugu: జనవరి 12th, 2023 కరెంట్ అఫైర్స్
Golden Globe Awards: గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు విజేతల పూర్తి వివరాలు
టీవీ మరియు చలనచిత్ర పరిశ్రమలకు సంబంధించిన గోల్డెన్ గ్లోబ్స్ (Golden Globes) హాలీవుడ్ అవార్డ్స్ సీజన్ కమెడియన్ జెరోడ్ కార్మిచెల్ హోస్ట్‌గా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో జనవరి 11వ తేదీ జరిగాయి. కాగా దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలో ‘నాటు నాటు’ పాట ఒరిజినల్ సాంగ్ విభాగంలో గొల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకుంది. ‘నాటు నాటు’ పాటను చంద్రబోస్ రాయగా, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాడారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రాఫర్గా పని చేశారు.
ఈ అవార్డులకు నామినేట్ అయిన చిత్రాలు, విజేతల పూర్తి జాబితా..
ఉత్తమ చిత్రం - డ్రామా
అవతార్: ది వే ఆఫ్ వాటర్
ఎల్విస్
ది ఫాబెల్మాన్స్ - విజేత
టార్
టాప్ గన్: మావెరిక్
ఉత్తమ చిత్రం - మ్యూజికల్ లేదా కామెడీ
బాబిలోన్
ది బాన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్ - విజేత
ప్రతిచోటా అన్నీ ఒకేసారి(Everything Everywhere All at Once)
గ్లాస్ ఆనియన్: ఎ నైవ్స్ అవుట్ మిస్టరీ
ట్రైయాంగిల్ అఫ్ షాడ్‌నెస్(Triangle of Sadness) మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Shanti Kumari: తెలంగాణ తొతి మహిళా సీఎస్‌గా శాంతికుమారి.. అసిస్టెంట్ కలెక్టర్ నుంచి స్పెషల్ సీఎస్ దాకా
రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా 1989 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ఎ.శాంతికుమారి నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఆమెను సీఎస్‌గా నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి వి.శేషాద్రి జనవరి 11న ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆమె తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా సీఎస్‌గా చరిత్రకెక్కారు. గత సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఏపీ కేడర్‌కు వెళ్లాలని ఆదేశిస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో కొత్త సీఎస్ నియామకం అనివార్యంగా జరిగింది.
సీఎస్ రేసులో ఆర్థిక, పురపాలక, అటవీ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, శాంతికుమారిల పేర్లు ప్రముఖంగా వినిపించగా, శాంతికుమారి వైపు సీఎం కేసీఆర్ మొగ్గు చూపారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశం తర్వాత శాంతికుమారి బీఆర్‌కేఆర్ భవన్‌లోని రాష్ట్ర సచివాలయం చేరుకుని సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు.
కేసీఆర్‌తో కలిసి పనిచేసిన శాంతికుమారి
శాంతికుమారి 1999 నవంబర్ నుంచి 2001 జూన్ వరకు మెదక్ జిల్లా కలెక్టర్‌గా పనిచేయగా, అప్పట్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన కేసీఆర్ డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు. 2015–2018 వరకు శాంతికుమారి సీఎంఓ ముఖ్యకార్యదర్శి కార్యదర్శిగా ఉన్నారు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)
Mohammed Faizal: లక్షద్వీప్ ఎంపీకి పదేళ్ల ఖైదు
లక్ష ద్వీప్ ఎంపీ, ఎన్సీపీ నేత మహమ్మద్ ఫైజల్ హత్యాయత్నం కేసులో లక్ష ద్వీప్ ఎంపీ, ఎన్సీపీ నేత మహమ్మద్ ఫైజల్ సహా నలుగురికి జిల్లా కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. పదేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.లక్ష జరిమానా విధిస్తూ సెషన్స్ కోర్టు జడ్జి కె.అనిల్‌కుమార్ తీర్పు చెప్పారు. 2009 లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పీఎం సయీద్ అల్లుడైన పదాంత సాలిహ్‌ను హత్య చేయడానికి ఫైజల్ మరో ముగ్గురు ప్రయత్నించినట్టు కేసు నమోదైంది. రాజకీయ కక్షలతోనే సాలిహ్‌ను హత్య చేయడానికి కుట్ర పన్నారని, అయితే అందులో వారు విఫలమయ్యారని కోర్టు స్పష్టం చేసింది.
ఈ తీర్పు నేపథ్యంలో ఎంపీ ఫైజల్ సహా దోషులు నలుగురిని కేరళలోని కన్నూర్ సెంట్రల్ జైలుకి తరలించారు. ఈ తీర్పుతో ఫైజల్ రాజకీయ భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎన్‌సీపీకి చెందిన నేత ఫైజల్ క్రిమినల్ కేసులో దోషిగా తేలడంతో ఆయనపై అనర్హత వేటు పడుతుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. 2009లో ఫైజల్ మరి కొంత మందితో కలిసి పదునైన ఆయుధాలతో సాలిహ్‌పై దాడి చేశారు. కత్తులు, కటారులు, కర్రలు, ఐరన్ రాడ్లతో కలిసి అతనిని వెంబడించి కొట్టారు. తీవ్రంగా గాయపడిన సాలిహ్‌ని ప్రత్యేక హెలికాప్టర్‌లో ఎర్నాకులం ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు.
Golden Globe Awards: గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు విజేతల పూర్తి వివరాలు
Jalebi Baba: జిలేబీ బాబాకు 14 ఏళ్ల జైలు
తనను తాను దేవుడిగా ప్రచారం చేసుకుంటూ అరాచకాలు సాగించిన జిలేబీ బాబా అలియాస్ అమర్‌వీర్ అలియాస్ బిల్లూ అలియాస్ అమర్‌పురి (63)కు పోక్సో చట్టం సెక్షన్ 6 కింద 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు హరియాణాలోని ఫతేహాబాద్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు అదనపు జిల్లా జడ్జి బల్వంత్‌సింగ్ జనవరి 11వ తేదీ ప్రకటించారు. ఓ బాలికపై రెండు సార్లు అత్యాచారం చేసిన కేసులో ఈ శిక్ష విధించారు. 100 మందికిపైగా మహిళలపై అత్యాచారం చేసి, వీడియోలు తీసినట్లు అతడిపై ఆరోపణలున్నాయి.
జిలేబీ బాబాను హరియాణా పోలీసులు 2018లో అరెస్టు చేశారు. అతడి ఫోన్‌లో 120కి పైగా అశ్లీల వీడియో క్లిప్పింగ్‌లను గుర్తించారు. జిలేబీ బాబా హరియాణాలోని తోహన్ పట్టణంలో బాబా బాలక్‌నాథ్ మందిరం అధినేతగా ప్రాచుర్యం పొందాడు. మహిళలకు మాదకద్రవ్యాలిచ్చి అత్యాచారం చేయడం, ఆ దురాగతాన్ని వీడియోలో చిత్రీకరించడం, వాటిని చూపి బ్లాక్‌మెయిల్ చేసి బాధితుల నుంచి డబ్బులు గుంజడం అతని స్టైల్.
కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)
Ozone Layer: ఓజోన్ పొర స్వయం చికిత్స
వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, తద్వారా ప్రకృతి విపత్తులతో అల్లాడిపోతున్న ప్రపంచానికి ఇదొక శుభవార్త. భూగోళంపై ఉష్ణోగ్రతలను నియంత్రించడంలో అత్యంత కీలకమైన ఓజోన్ పొర స్వయం చికిత్స చేసుకుంటోంది. ఓజోన్ పొరకు ఏర్పడిన రంధ్రం క్రమంగా పూడుకుపోతోంది. క్లోరో ఫ్లోరో కార్బన్ల ఉద్గారాలు క్రమంగా తగ్గుముఖం పడుతుండడమే ఇందుకు కారణం. ఐక్యరాజ్యసమితికి చెందిన సైంటిఫిక్ అసెస్‌మెంట్ ప్యానెల్ ఈ విషయాన్ని ఒక నివేదికలో వెల్లడించింది. ప్రతి నాలుగేళ్లకోసారి ఈ నివేదిక విడుదల చేస్తారు. ఓజోన్ పొర పూడుకుపోవడం 2022లో మొదలైందని నివేదికలో తెలిపింది. ఓజోన్ రంధ్రం 2022 సెప్టెంబర్ 7 నుంచి అక్టోబర్ 13 మధ్య సగటున 23.2 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యానికి కుంచించుకుపోయింది.
క్లోరో ఫ్లోరో కార్బన్ల ఉద్గారాలు ఇదే క్రమంలో తగ్గిపోతే 2066 నాటికి పూర్తిగా పూడుకుంటుందని పేర్కొన్నారు. మాంట్రియల్ ప్రోటోకాల్ సత్ఫలితాలు ఇస్తున్నట్లు భావిస్తున్నామని తెలిపారు. ఓజోన్ పొరకు రంధ్రం ఏర్పడినట్లు తొలిసారిగా 1980లో గుర్తించారు. మరో నాలుగు దశాబ్దాల్లో 1980 నాటి స్థాయికి ఓజోన్ పొర చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు నిపుణులు స్పష్టం చేశారు. ఉష్ణోగ్రత 2100 నాటికి 0.3 నుంచి 0.5 డిగ్రీల సెల్సియస్ తగ్గేలా హైడ్రో ఫ్లోరో కార్బన్ల ఉత్పత్తి, వినియోగాన్ని తగ్గించుకోవాలని మాంట్రికల్ ప్రోటోకాల్ నిర్ధేశిస్తోంది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)
Global Investors Summit: పెట్టుబడులకు ఆకర్శణీమైన గమ్యస్థానంగా భారత్.. మోదీ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జనవరి 11న జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల 7వ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచ వాణిజ్యంలో భారత్‌ను ఒక వేగుచుక్కగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) పరిగణిస్తోందని ఉద్ఘాటించారు. ఆర్థిక సంక్షోభం తలెత్తితే సమర్థంగా ఎదుర్కొనే సత్తా ఇతర దేశాలకంటే భారత్‌కే అధికంగా ఉందని సాక్షాత్తూ ప్రపంచ బ్యాంక్ చెబుతోందని గుర్తుచేశారు. మన దేశ ప్రాథమిక ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడమే ఇందుకు కారణమని వివరించారు. గత ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం సంస్కరణల వేగాన్ని మరింత పెంచిందని పేర్కొన్నారు.
నంబర్ వన్ స్థానంలో భారత్
‘‘నేటి నూతన భారతదేశం ప్రైవేట్ రంగ బలంపై ఆధారపడుతూ వేగంగా ముందుకు సాగుతోంది. రక్షణ, గనులు, అంతరిక్షం వంటి కీలక వ్యూహాత్మక రంగాల్లో ప్రైవేట్ రంగం ప్రవేశానికి ద్వారాలు తెరిచాం. మల్టి మోడల్ మౌలిక సదుపాయాల వల్ల దేశంలో పెట్టుబడులకు అవకాశాలు భారీగా పెరిగాయి. బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ, యువ జనాభా అధికంగా ఉండడం, రాజకీయ స్థిరత్వం మన దేశ ప్రగతికి చోదక శక్తులు. మన బలాలే పెట్టుబడిగా సులభతర జీవనం, సులభతర వాణిజ్యాన్ని పెంపొందించడానికి త్వరితంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Pravasi Bharatiya Divas: మధ్యప్రదేశ్‌లో 17వ ప్రవాసీ భారతీయ దివస్
World Bank: దిగువబాటన భారత్ వృద్ధి రేటు
భారత్ 2023–24 ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంక్ కుదించింది. 6.9 శాతంగా ఉన్న క్రితం అంచనాలను 6.6 శాతానికి కుదిస్తున్నట్లు తన తాజా ఎకనమిక్ అప్‌డేట్‌లో తెలిపింది. భారత్ 2021–22లో 8.7 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకోగా, ప్రస్తుత 2022–23లో ఈ రేటు 6.9 శాతంగా ఉంటుందని ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. కాగా, 2024–25 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును ప్రపంచ బ్యాంక్ 6.1 శాతంగా అంచనావేసింది.
అంటే వృద్ధి రేటు క్రమంగా దిగువకే పయనిస్తుందన్నది ప్రపంచ బ్యాంక్ అంచనా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితి, ఎగుమతులు, పెట్టుబడుల వేగం తగ్గడం తన అంచనాలకు కారణమని ప్రపంచ బ్యాంక్ పేర్కొంటోంది. అయితే ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీల్లో భారత్ తొలి స్థానంలో ఉంటుందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది.