Skip to main content

జమ్మూకశ్మీర్, లదాఖ్‌ల కొత్త మ్యాప్ విడుదల

2019, అక్టోబర్ 31న కేంద్రపాలిత ప్రాంతాలుగా అవతరించిన జమ్మూకశ్మీర్, లదాఖ్‌ల కొత్త మ్యాప్‌ను కేంద్ర హోంశాఖ నవంబర్ 2న విడుదల చేసింది.
ఇందులో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) జమ్మూకశ్మీర్‌లో ఉండగా, గిల్గిత్-బల్టిస్తాన్ లదాఖ్‌లో ఉంది. పీఓకేలోని ముజఫరాబాద్ భారత సరిహద్దుగా ఉంది. తాజా మ్యాప్ ప్రకారం లదాఖ్ రెండు జిల్లాలను (కార్గిల్, లేహ్) కలిగి ఉంది. పాత కశ్మీర్ రాష్ట్రంలో 14 జిల్లాలు ఉండగా, అందులోని లదాఖ్, లేహ్‌లను లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో చేర్చారు. ఇందులో కార్గిల్ జిల్లాను కొత్తగా ఏర్పాటు చేశారు. కార్గిల్‌తో కలిపి రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మరో 14 జిల్లాలను అదనంగా ఏర్పాటు చేశారు. దీంతో రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 28 జిల్లాలు ఏర్పాటయ్యాయి.
నోట్ : తాజా మ్యాప్‌ను స‌ర్వే ఆఫ్ ఇండియా రూపొందించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
జమ్మూకశ్మీర్, లదాఖ్‌ల కొత్త మ్యాప్ విడుదల
ఎప్పుడు : నవంబర్ 2
ఎవరు : కేంద్ర హోంశాఖ
ఎందుకు : నూతన కేంద్రప్రాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్, లదాఖ్ అవతరించిన నేపథ్యంలో
Published date : 04 Nov 2019 05:46PM

Photo Stories