జలియన్‌వాలా బాగ్ స్మారక నాణెం విడుదల
Sakshi Education
జలియన్‌వాలా బాగ్ మారణకాండ జరిగి 2019, ఏప్రిల్ 13నాటికి వందేళ్లు పూర్తయిన సందర్భంగా రూపొందించిన రూ. 100 స్మారక నాణెం, తపాలా బిళ్లను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు.
1919 ఏప్రిల్ 13న సిక్కుల ముఖ్య పండుగ వైశాఖీ సందర్భంగా అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్‌కు వేలాదిగా ప్రజలు చేరుకున్నారు. ఈ సందర్భంగా కల్నల్ రెజినాల్డ్ డయ్యర్ ఆధ్వర్యంలో బ్రిటిష్ ఇండియన్ సైన్యం వారిపై కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 379 మంది చనిపోగా, 1200 మంది గాయపడ్డారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జలియన్‌వాలా బాగ్ రూ. 100 స్మారక నాణెం విడుదల
ఎప్పుడు : ఏప్రిల్ 13
ఎవరు : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : జలియన్‌వాలా బాగ్, అమృత్‌సర్, పంజాబ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : జలియన్‌వాలా బాగ్ రూ. 100 స్మారక నాణెం విడుదల
ఎప్పుడు : ఏప్రిల్ 13
ఎవరు : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : జలియన్‌వాలా బాగ్, అమృత్‌సర్, పంజాబ్
Published date : 15 Apr 2019 05:42PM