జిల్లాల పునర్వ్యవస్థీకరణకు అధ్యయన కమిటీ
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీలం సాహ్ని అధ్యక్షతన ఐదుగురు అధికారులతో అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ ఆగస్టు 7న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందు కోసమే కొత్త జిల్లాలు...
క్విక్ రివ్యూ :
ఏమిటి : జిల్లాల పునర్వ్యవస్థీకరణకు అధ్యయన కమిటీ
ఎప్పుడు : ఆగస్టు 7
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు:రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేయడంపై అధ్యయనం చేసేందుకు
ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్‌గా ఉండే ఈ కమిటీలో భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్, సాధారణ పరిపాలన (సర్వీసెస్) శాఖ కార్యదర్శి, ప్రణాళిక శాఖ కార్యదర్శి, సీఎం కార్యాలయ అధికారి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ నివేదికను మూడు నెలల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలి.
కమిటీకి ప్రభుత్వం నిర్దేశించిన పంచ సూత్రాలు..
కమిటీకి ప్రభుత్వం నిర్దేశించిన పంచ సూత్రాలు..
- ప్రస్తుతం ఉన్న మౌలిక వసతులు, మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం.
- పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర, జిల్లా, రెవెన్యూ డివిజన్ స్థాయిల్లో నిర్దిష్ట బాధ్యతలున్నాయి. పునర్వ్యవస్థీకరణలో వీటిని పరిగణనలోకి తీసుకోవాలి.
- ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలుండాలి.
- వీలైనంత తక్కువ వ్యయంతో జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలి.
- ఈ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని భౌగోళిక సరిహద్దులు, పరిపాలన కేంద్రాలను సూచిస్తూ 25 జిల్లాల ఏర్పాటుకు కమిటీ సిఫార్సులు చేయాలి.
ఇందు కోసమే కొత్త జిల్లాలు...
- ప్రభుత్వ సేవలను, పాలనను ప్రజల గడప ముందుకే తీసుకువెళ్లడం ద్వారా వారిలో సంతృప్త స్థాయిని పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యం.
- ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తోంది.
- ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని ప్రజలకు జిల్లా అధికార యంత్రాంగాన్ని మరింత చేరువ చేయడమే లక్ష్యంగా జిల్లాల ఏర్పాటుకు నిర్ణయించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జిల్లాల పునర్వ్యవస్థీకరణకు అధ్యయన కమిటీ
ఎప్పుడు : ఆగస్టు 7
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు:రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేయడంపై అధ్యయనం చేసేందుకు
Published date : 10 Aug 2020 05:43PM