జీవితకాల గరిష్టస్థాయికి ఫారెక్స్ నిల్వలు
Sakshi Education
భారత విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్ రిజర్‌వ్స) జీవితకాల గరిష్టస్థాయికి చేరాయి.
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. 2020, ఫిబ్రవరి 14తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు 3.091 బిలియన్ డాలర్ల పెరుగుదలతో 476.092 బిలియన్ డాలర్లకు ఎగశాయి. అంతక్రితం వారం 1.701 బిలియన్ డాలర్లు పెరిగి 473 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక తాజా వారంలో.. మొత్తం మారక నిల్వల్లో ప్రధాన భాగంగా డాలర్ల రూపంలో పేర్కొనే విదేశీ కరెన్సీ ఆస్తులు (ఎఫ్‌సీఏ) 2.763 బిలియన్ డాలర్లు పెరిగి 441.949 బిలియన్ డాలర్లకి చేరాయి. బంగారం నిల్వలు 344 మిలియన్ డాలర్లు తగ్గి 29.123 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
Published date : 22 Feb 2020 05:43PM