Skip to main content

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా లోకేష్‌కుమార్

హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్‌గా రంగారెడ్డి జిల్లా ప్రస్తుత కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ నియమితులయ్యారు.
ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆగస్టు 26న ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో దాదాపు ఏడాదిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ పదవితోపాటు జల మండలి ఇన్‌చార్జి ఎండీగా ఉన్న దానకిశోర్, ఇకపై జలమండలి ఎండీ బాధ్యతలకే పరిమితం కానున్నారు.

లోకేష్‌కుమార్‌ను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా నియమించడంతో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.హరీష్‌కు కలెక్టర్‌గా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 26
ఎవరు : డీఎస్ లోకేష్‌కుమార్
Published date : 27 Aug 2019 05:20PM

Photo Stories