Skip to main content

జీడీపీ అంశంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిన కోఆపరేటివ్ సొసైటీ?

ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ (ఐసీఏ)... 9వ వార్షిక వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్ (డబ్ల్యూసీఎం) రిపోర్ట్-2020 ఎడిషన్ ర్యాంక్‌లను ప్రకటించింది.
Current Affairs

ఐసీఏ, యూరోపియన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆన్ కోఆపరేటివ్ అండ్ సోషల్ ఎంటర్‌ప్రైజెస్ (యూరిస్) సంయుక్తంగా కలిసి జనవరి 21న ఒక వెబినార్‌లో ఈ ర్యాంకుల నివేదికను విడుదల చేశాయి. టర్నోవర్, తలసరి జీడీపీ రెండు విభాగాల్లో ప్రపంచవ్యాప్తంగా 300 సహకార సంస్థలతో ర్యాంక్‌లను ప్రకటించారు. తలసరి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) విభాగంలో... ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ (ఐఎఫ్‌ఎఫ్‌సీఓ- ఇఫ్కో) అగ్రస్థానంలో నిలిచింది. టర్నోవర్ పరంగా 65వ స్థానంలో నిలిచింది.

ఇఫ్కో గురించి...

  • న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఎరువుల తయారీ, విక్రయాల్లో ఇఫ్కో ఉంది.
  • దేశవ్యాప్తంగా రైతులను భాగస్వామ్యం చేయడం, భారత సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో ఇఫ్కో కృషి చేస్తోంది.
  • 36 వేల మంది కో-ఆపరేటివ్ సభ్యులున్న ఇఫ్కో టర్నోవర్ దాదాపు 7 బిలియన్ డాలర్లుగా ఉంది.
  • ప్రస్తుతం ఇఫ్కో ఎండీగా యూఎస్ అవస్తీ ఉన్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : డబ్ల్యూసీఎం రిపోర్ట్-2020 ఎడిషన్ ర్యాంకులు జీడీపీ విభాగంలో అగ్రస్థానం
ఎప్పుడు : జనవరి 21
ఎవరు : ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ (ఐఎఫ్‌ఎఫ్‌సీఓ- ఇఫ్కో)
ఎక్కడ : ప్రపంచంలో
Published date : 23 Jan 2021 03:37PM

Photo Stories