జెడ్‌ఎస్‌ఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా?
Sakshi Education
కొల్‌కతాలోని జువాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జెడ్‌ఎస్‌ఐ) నూతన డైరెక్టర్‌గా ధృతీ బెనర్జీ ఆగస్టు 6న బాధ్యతలు చేపట్టారు.
కేంద్ర పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల శాఖ పరిధిలో పనిచేసే జెడ్‌ఎస్‌ఐకి 105 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ సంస్థ డైరెక్టర్‌గా ఒక మహిళ బాధ్యతలు చేపట్టడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ధృతీ మాట్లాడుతూ... పరిశోధనల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోనున్నట్లు తెలిపారు. భారతదేశ భిన్నత్వాన్ని ప్రజలంతా తెలుసుకొనేలా కృత్రిమ మేధ(ఏఐ), ఇంటర్నెట్ ద్వారా వారికి చేరువ కావడమే తమ సంస్థ లక్ష్యమని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉందన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జెడ్‌ఎస్‌ఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా?
ఎప్పుడు : ఆగస్టు 6
ఎవరు : దృతీ బెనర్జీ
ఎక్కడ : కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
క్విక్ రివ్యూ :
ఏమిటి : జెడ్‌ఎస్‌ఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా?
ఎప్పుడు : ఆగస్టు 6
ఎవరు : దృతీ బెనర్జీ
ఎక్కడ : కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
Published date : 07 Aug 2021 05:40PM