జావా సముద్రంలో కూలిన ఇండోనేసియా విమానం పేరు?
శ్రీవిజయ ఎయిర్ సం స్థ కు చెందిన ఈ విమానం జనవరి 9న మధ్యాహ్నం 2.36 గంటలకు జకార్తా నుంచి బోర్నియో ద్వీపంలోని పశ్చిమ కాళీమంథన్ ప్రావిన్సు రాజధాని పొంటియానక్కు బయలుదేరింది. విమానంలో 50 మంది ప్రయాణికులు, 12 సిబ్బంది సహా మొత్తం 62 మంది ఉన్నారు. వీరంతా ఇండోనేసియన్లే.
కూలిన చోటు గుర్తించాం
కనిపించకుండా పోయిన విమానం జావా సముద్రంలో కూలిపోయిందని, ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గుర్తించామని జనవరి 10న ఇండోనేసియా ప్రభుత్వం ప్రకటించింది. ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు ఎంతో కీలకమైన బ్లాక్‌బాక్స్ ఉన్న చోటును కూడా గుర్తించినట్లు పేర్కొంది.
ఇండోనేసియా రాజధాని: జకార్తా; కరెన్సీ: ఇండోనేసియన్ రూపియా
ఇండోనేసియా ప్రస్తుత అధ్యక్షుడు: జోకో విడోడో
కొత్త రాజధానిగా కాళీమంథన్...
ఇండోనేసియా కొత్త రాజధానిగా బోర్నియో ద్వీపంలోని కాళీమంథన్‌ను ఎంపికచేసినట్లు ఆ దేశాధ్యక్షుడు జొకో విడోడో 2019, ఆగస్టు 27న ప్రకటించారు. కాళీమంథన్ తూర్పు భాగంలోని అటవీ ప్రాంతంలో 1,80,000 హెక్టార్లలో రాజధానిని అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుత రాజధాని జకార్తా ప్రతీ సంవత్సరం 25 సెంటీమీటర్ల మేర సముద్ర ముంపునకు గురవుతుండటం, వరదలు, భూకంపాల ముప్పు ఎక్కువ ఉండటంతోపాటు విపరీతమైన వాయు కాలుష్యం, ట్రాఫిక్ ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త రాజధాని అభివృద్ధికి రూ.2.3లక్షల కోట్లు కేటాయించినట్లు జొకో చెప్పారు.