జాతినుద్దేశించి రాష్ట్రపతి కోవింద్ ప్రసంగం
Sakshi Education
73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆగస్టు 14న జాతినుద్దేశించి ప్రసంగించారు.
రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేయడం, జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టడం వల్ల ఆ రాష్ట్ర ప్రజలు అత్యంత భారీ ప్రయోజనాలను పొందుతారని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు. మిగతా దేశ పౌరులంతా ఏయే హక్కులు, ప్రయోజనాలు, సౌకర్యాలను పొందుతున్నారో.. ఆ లాభాలను ఇకపై జమ్మూ కశ్మీర్, లదాఖ్ ప్రజలు కూడా పొందగలన్నారు. తక్షణ ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ ఇటీవలే పార్లమెంటు ఆమోదం పొందిన చట్టం తదితరాలు జమ్మూ కశ్మీర్‌లోని ఆడబిడ్డలకు కూడా న్యాయం అందిస్తాయన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతినుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం
ఎప్పుడు : ఆగస్టు 14
ఎందుకు : 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతినుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం
ఎప్పుడు : ఆగస్టు 14
ఎందుకు : 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా
Published date : 15 Aug 2019 05:27PM