Skip to main content

ఇయర్ ఆఫ్ ఏఐగా 2020 : మంత్రి కేటీఆర్

ఐటీ రంగంలో కృత్రిమ మేధస్సు వాటా భవిష్యత్‌లో రూ.1,284.2 లక్షల కోట్లకు చేరే అవకాశమున్న నేపథ్యంలో, అవకాశాలను అంది పుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు వెల్లడించారు.
Current Affairsరాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో జనవరి 2న హైదరాబాద్‌లో జరిగిన ఏఐ-2020 లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తూ.. 2020ని ‘ఇయర్ ఆఫ్ ఏఐ’గా ప్రకటించారు. రాష్ట్రంలో ఏఐ సాంకేతికత వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు ఏడాది పొడవునా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు.

కేటీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు...
  • నాస్కామ్ నివేదిక ప్రకారం దేశంలో ప్రస్తుతం 2 బిలియన్ డాలర్లుగా ఉన్న ఏఐ రంగం వాటా 2025 నాటికి 16 బిలియన్ డాలర్లకు చేరడంతో పాటు, 2021 నాటికి 8 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ శాఖ తరఫున 2020ని ‘ఇయర్ ఆఫ్ ది ఏఐ’గా ప్రకటిస్తున్నాం.
  • ఐఐటీ హైదరాబాద్ తరహాలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు, ఇతర విద్యా సంస్థల్లోనూ ఏఐని బోధిస్తాం.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇయర్ ఆఫ్ ఏఐగా 2020
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : తెలంగాణ రాష్ట్రంలో ఏఐ సాంకేతికత వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు

మాదిరి ప్రశ్నలు
Published date : 03 Jan 2020 06:08PM

Photo Stories