Skip to main content

ఇటీవల ఏ జిల్లాకు ఏపీ–అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టును విస్తరించారు?

ఏపీ–అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోని 400 గ్రామాల్లో అమూల్ సంస్థ పాలు సేకరిస్తుండగా.. కొత్తగా గుంటూరు జిల్లాకు ప్రాజెక్టును విస్తరించారు.
Current Affairs గుంటూరు జిల్లాలో కొత్తగా 129 గ్రామాలతోపాటు, చిత్తూరు జిల్లాలో అదనంగా మరో 174 గ్రామాల నుంచి అమూల్‌ ద్వారా పాల సేకరణను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏప్రిల్‌ 16న తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు.

డిసెంబర్‌ 2న ప్రారంభం...
ఆంధ్రప్రదేశ్‌లోని మహిళా పాడి రైతులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి ఉద్దేశించిన ‘ఏపీ–అమూల్‌ పాల వెల్లువ ప్రాజెక్టు’ ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టు తొలి దశ కార్యక్రమాన్ని 2020, డిసెంబర్‌ 2న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. అమూల్‌ ప్రాజెక్టు ద్వారా భాగంగా తొలి దశలో చిత్తూరు, వైఎస్సార్‌ కడప, ప్రకాశం జిల్లాల్లో 400 గ్రామాల్లో పాలసేకరణ ప్రారంభమైంది.

అమూల్‌ ప్రాజెక్టు గురించి ఇంకా వివరాలు కావాలంటే... క్లిక్‌ చేయండి. 

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : ఏపీ–అమూల్‌ పాల వెల్లువ ప్రాజెక్టు విస్తరణ
ఎప్పుడు : ఏప్రిల్‌ 16
ఎవరు : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : మహిళా పాడి రైతులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి
Published date : 19 Apr 2021 11:35AM

Photo Stories