ఇరాక్‌లో ఘోర పడవ ప్రమాదం
Sakshi Education
ఇరాక్‌లోని మోసుల్ నగరంలో ఘోర పడవ ప్రమాదం సంభవించింది.
టెగ్రిస్ నదిపై వెళుతున్న ఓ నౌక మార్చి 21న నదీ ప్రవాహానికి పల్టీ కొట్టింది. ఈ దుర్ఘటనలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 55 మంది ప్రయాణికులను అధికారులు రక్షించారు. ఈ విషయమై ఇరాక్ ఆరోగ్యశాఖ మంత్రి సయిఫ్-అల్-బదర్ మాట్లాడుతూ.. ప్రమాద సమయంలో నౌకలో 150 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. ఇది నౌక సామర్థ్యం కంటే రెట్టింపన్నారు. కుర్దుల నూతన సంవత్సరాది నౌరోజ్ సందర్భంగా వీరంతా మోసుల్ నుంచి ఉమ్-అల్-రబీన్ అనే పర్యాటక దీవికి బయలుదేరారని వెల్లడించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇరాక్‌లో ఘోర పడవ ప్రమాదం
ఎప్పుడు : మార్చి 21
ఎక్కడ : టెగ్రిస్ నది, మోసూల్, ఇరాక్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇరాక్‌లో ఘోర పడవ ప్రమాదం
ఎప్పుడు : మార్చి 21
ఎక్కడ : టెగ్రిస్ నది, మోసూల్, ఇరాక్
Published date : 22 Mar 2019 04:44PM