ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్ పోర్టల్ ప్రారంభం
Sakshi Education
‘ఇన్‌కమ్ ట్యాక్స్ ఎక్స్‌ఛేంజ్ ఇన్ఫర్మేషన్’ వెబ్ పోర్టల్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్స్ (సీబీడీటీ) చైర్మన్ ప్రమోద్ చంద్ర మోదీ(పీసీ మోడీ) నవంబర్ 22న ప్రారంభించారు.
ఈ పోర్టల్‌తో ఆర్థిక సంస్థలకు, ఐటీ అధికారులకు, ప్రజలకు ఆటోమెటిక్ ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఏఈఓఐ) అంతా అందుబాటులో ఉంటుంది. ఏఈఓఐ చట్టాలు, నిబంధనలు, విధానాల వంటివి మన ఆర్థిక సంస్థలకే కాకుండా అంతర్జాతీయ ట్యాక్స్ అథారిటీలు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూన్స్ ఉపయుక్తంగా ఉంటాయి. సీబీడీటీ జారీ చేసే పాలసీలు, టెక్నికల్ సర్క్‌లర్లు, నోటిఫికేషన్స్ తో పాటూ దేశ, అంతర్జాతీయ నియంత్రణ సంస్థల గైడ్‌లైన్స్, లింక్స్ అన్నింటికీ ఈ పోర్టల్ స్టోరేజీ కేంద్రంగా ఉంటుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇన్‌కమ్ ట్యాక్స్ ఎక్స్‌ఛేంజ్ ఇన్ఫర్మేషన్ వెబ్ పోర్టల్ ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : సీబీడీటీ చైర్మన్ ప్రమోద్ చంద్ర మోదీ
ఎందుకు : ప్రజలకు ఆటోమెటిక్ ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఏఈఓఐ) అందుబాటులో ఉంచడానికి

Published date : 27 Nov 2019 05:52PM