Skip to main content

ఇంగ్లీష్ ప్రొ మొబైల్ యాప్ ఆవిష్కరణ

ఇంగ్లిష్ భాషను సులభతరంగా నేర్చుకునేందుకు రూపొందించిన ‘ఇంగ్లీష్ ప్రొ’ యాప్‌ను కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ఆగస్ట్ 31న ఢిల్లీలో ప్రారంభించారు.
Current Affairs
యూనివర్సిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ (యూఎస్‌ఆర్)లో భాగంగా ఇంగ్లిష్ అండ్ ఫారేన్ లాంగ్వేజస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు, ఆసక్తి గల అన్ని వర్గాల ప్రజలు ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని ఇఫ్లూ వీసీ ప్రొఫెసర్ సురేష్‌కుమార్ తెలిపారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఇంగ్లీష్ ప్రొ యాప్ ఆవిష్కరణ
ఎప్పుడు : ఆగస్టు 31
ఎవరు : కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్
ఎక్కడ : న్యూ ఢిల్లీ
ఎందుకు : ఇంగ్లిష్ భాషను సులభతరంగా నేర్చుకునేందుకు
Published date : 01 Sep 2020 04:45PM

Photo Stories