Skip to main content

ఇంధన రంగంలో పటిష్ట భాగస్వామ్యం: భారత్–అమెరికా

ఇంధన రంగంలో తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్ట పరచుకోవాలని భారత్–అమెరికాలు నిర్ణయించాయి.
Current Affairsప్రత్యేకించి పర్యావరణ సానుకూల, పునరుత్పాదక ఇంధన రంగంపై తమ బంధాన్ని మరింత బలపరచుకోవాలని రెండు దేశాలూ భావిస్తున్నట్లు మార్చి 30న అధికారిక ప్రకటన వెలువడింది. భారత్‌ చమురు వ్యవహారాల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌.. అమెరికా ఇంధన శాఖ మంత్రి జెన్నిఫర్‌ గ్రాన్హోమ్‌తో జరిగిన ప్రాథమిక చర్చల అనంతరం ఈ ప్రకటన వెలువడింది.

ఇరాన్, టర్కీ విదేశీ మంత్రులతో జైశంకర్‌ భేటీ
హార్ట్‌ ఆఫ్‌ ఏషియా సదస్సులో పాల్గొనేందుకు తజికిస్థాన్‌లో పర్యటిస్తున్న భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌... మార్చి 29న ఆ దేశ రాజధాని దుషాంబేలో ఇరాన్, టర్కీ విదేశాంగ మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇరాన్‌ విదేశాంగ మంత్రి జావెద్‌ జరీఫ్‌తో చాబహార్‌ పోర్టు ప్రాజెక్టు, ద్వైపాక్షిక సహకారంపై చర్చించారు.
Published date : 31 Mar 2021 06:06PM

Photo Stories