ఇండోనేసియా ఓపెన్ రద్దు: బీడబ్ల్యూఎఫ్
Sakshi Education
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉత్పాతం కొనసాగుతుండటంతో... 2020, జూలై వరకు అంతర్జాతీయ టోర్నమెంట్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించింది.
టోర్నీ ఆతిథ్య సంఘాలతో, ఆయా దేశాల సమాఖ్యలతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏప్రిల్ 6న తెలిపింది. రద్దయిన టోర్నీల్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ (జూన్ 2–7), థాయ్‌లాండ్ ఓపెన్ (జూన్ 9–14), ఇండోనేసియా ఓపెన్ (జూన్ 16–21), రష్యా ఓపెన్ (జూలై 7–12) ఉన్నాయి.
షూటింగ్ వరల్డ్‌కప్‌లు కూడా...
మరోవైపు మే నెలలో భారత్‌లో జరగాల్సిన రెండు ప్రపంచకప్ టోర్నమెంట్‌లను... మ్యూనిచ్, బాకు నగరాల్లో జూన్‌లో జరగాల్సిన రెండు ప్రపంచకప్ టోర్నమెంట్‌లను రద్దు చేస్తున్నట్లు అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020, జూలై వరకు అంతర్జాతీయ టోర్నమెంట్‌లు రద్దు
ఎప్పుడు : ఏప్రిల్ 6
ఎవరు : ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్)
ఎందుకు : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉత్పాతం కొనసాగుతుండటంతో
Published date : 07 Apr 2020 06:04PM