ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి?
Sakshi Education
దేశంలోని న్యూస్‌పేపర్లు, మాగజీన్లు, పీరియాడికల్స్‌కు సంబంధించిన అపెక్స్‌బాడీ ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ(ఐఎన్‌ఎస్) 2020-21 అధ్యక్షుడిగా ఎల్.ఆదిమూలం ఎన్నికయ్యారు.
81వ వార్షిక సాధారణ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఎల్.ఆదిమూలం హెల్త్ అండ్ ది యాంటీసెప్టిక్ జర్నల్ ప్రతినిధిగా ఉన్నారు. ఐఎన్‌ఎస్ నూతన కార్యవర్గంలో డిప్యూటీ ప్రెసిడెంట్‌గా ఆనందబజార్ పత్రిక నుంచి డి.డి.పుర్కాయస్త, వైస్ ప్రెసిడెంట్‌గా ఎకనమిక్ టైమ్స్ నుంచి మోహిత్ జైన్, గౌరవ కోశాధికారిగా రాకేష్ శర్మ(ఆజ్ సమాజ్), సెక్రటరీ జనరల్‌గా మేరి పాల్ ఎన్నికయ్యారు. మరో 11 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ(ఐఎన్‌ఎస్) 2020-21 అధ్యక్షుడిగా ఎన్నిక
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : ఎల్.ఆదిమూలం
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ(ఐఎన్‌ఎస్) 2020-21 అధ్యక్షుడిగా ఎన్నిక
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : ఎల్.ఆదిమూలం
Published date : 26 Sep 2020 05:16PM