Skip to main content

ఇండియాలో ఫేస్‌బుక్‌ గ్రీవెన్స్‌ ఆఫీసర్‌గా నియమితులైన మహిళ?

ఇండియాలో ఫేస్‌బుక్‌ గ్రీవెన్స్‌ ఆఫీసర్‌గా స్ఫూర్తి ప్రియ నియమితులయ్యారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ యాజమాన్యం జూన్ 7న ప్రకటించింది.
Current Affairs భారత్‌లో ఫేస్‌బుక్‌పై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్ఫూర్తి ప్రియ పరిష్కరిస్తారని తెలిపింది. తమ ఖాతాదారులు ఫిర్యాదుల విషయంలో స్ఫూర్తి ప్రియను ఈ–మెయిల్‌ ద్వారా సంప్రదించవచ్చని సూచించింది. అంతేకాకుండా పోస్టు ద్వారా కూడా ఢిల్లీలోని తమ కార్యాలయానికి ఫిర్యాదలు చేయవచ్చని పేర్కొంది. ఈ– మెయిల్‌ ఐడీ, అడ్రస్‌లను ఫేస్‌బుక్‌ తమ వెబ్‌సైట్‌లో ఉంచనుంది. కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ నిబంధనలను ఇటీవలే అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిబంధనల ప్రకారం.. 50 లక్షలకు పైగా ఖాతాదారులున్న సోషల్‌ మీడియా వేదికలు తప్పనిసరిగా గ్రీవెన్స్‌ ఆఫీసర్‌ను, నోడల్‌ ఆఫీసర్‌ను, చీఫ్‌ కాంప్లయన్స్‌ ఆఫీసర్‌ను నియమించుకోవాలి. వీరంతా భారత్‌లోనే నివసిస్తూ ఉండాలి. వాట్సాప్‌ ఇటీవలే పరేష్‌ బి.లాల్‌ను ఇండియాలో తమ గ్రీవెన్స్‌ ఆఫీసర్‌గా నియమించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియాలో ఫేస్‌బుక్‌ గ్రీవెన్స్‌ ఆఫీసర్‌గా నియమితులైన మహిళ?
ఎప్పుడు : జూన్ 7
ఎవరు : స్ఫూర్తి ప్రియ
ఎందుకు : కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అమల్లోకి తెచ్చిన కొత్త ఐటీ నిబంధనల మేరకు...
Published date : 08 Jun 2021 06:50PM

Photo Stories