Skip to main content

ఈజిప్టు మాజీ అధ్యక్షుడు ముబారక్ కన్నుమూత

ఈజిప్టు మాజీ అధ్యక్షుడు, సుమారు 30 ఏళ్లపాటు మధ్యప్రాచ్యంలో శాంతి, సుస్థిరతలకు ప్రతీకగా చెప్పుకునే నేత హోస్నీ ముబారక్ (91) ఫిబ్రవరి 25న మరణించారు.
Current Affairsఆయన ఆరోగ్య సమస్యల కారణంగా మరణించినట్లు ఈజిప్టు టెలివిజన్ ప్రకటించింది.1981 నుంచి 2011 వరకు ఈజిప్టు అధ్యక్షుడిగా ఉన్న ముబారక్ అమెరికాకు సన్నిహితుడిగా మెలిగారు. ముబారక్ నియంతృత్వ ధోరణిని అనుసరిస్తున్నారంటూ 2011లో దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు చేపట్టారు. 18 రోజులపాటు జరిగిన ఈ ఆందోళనల కారణంగా దాదాపు 900 మంది మరణించారు. దీంతో 2011 ఫిబ్రవరి 11న సైన్యం ఆయన్ను పదవీచ్యుతుణ్ని చేసి అధికారాలను తన చేతుల్లోకి తీసుకుంది. 900 మంది ఆందోళనకారుల మరణాలను నిలువరించడంలో విఫలమయ్యారన్న ఆరోపణలపై న్యాయస్థానాలు 2012 జూన్‌లో ముబారక్‌ను దోషిగా నిర్ధారించి యావజ్జీవ జైలుశిక్ష విధించాయి. అయితే ఈజిప్టు ఉన్నత న్యాయస్థానం 2014లో ఆ తీర్పును కొట్టివేసి ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఈజిప్టు మాజీ అధ్యక్షుడు కన్నుమూత
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు : హోస్నీ ముబారక్ (91)
ఎందుకు : అనారోగ్యం కారణంగా
Published date : 26 Feb 2020 05:52PM

Photo Stories