Skip to main content

ఈ-దంత్‌సేవ వెబ్‌సైట్ ప్రారంభం

నోటి ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన పెంచేందుకు ‘ఈ-దంత్‌సేవ’ పేరుతో రూపొందించిన వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ న్యూఢిల్లీలో అక్టోబర్ 7న ప్రారంభించారు.
అలాగే అంధుల కోసం బ్రెయిలీ బుక్‌లెట్‌నూ మంత్రి ఆవిష్కరించారు. ఒక్క క్లిక్‌తో నోటి ఆరోగ్యం గురించి సమస్త సమాచారం తెలిపేందుకు వీలుగా ఈ-దంత్‌సేవను రూపొందించినట్లు మంత్రి చెప్పారు. దంత వైద్య సేవలు అందించే సంస్థలు, కళాశాలల వివరాలను జీపీఆర్‌ఎస్‌తో సహా యాప్‌లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఈ-దంత్‌సేవ వెబ్‌సైట్ ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 7
ఎవరు : కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : నోటి ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన పెంచేందుకు
Published date : 09 Oct 2019 06:08PM

Photo Stories