Skip to main content

హుగ్లీ నదిలో జలప్రవేశం చేసిన తొలి దేశీయ స్టెల్త్ యుద్ధనౌక?

పీ17ఏ ప్రాజెక్టు కింద తయారైన తొలి దేశీయ స్టెల్త్ యుద్ధనౌక ‘హిమగిరి’ జలప్రవేశం చేసింది.
Current Affairs
త్రిదళాధిపతి(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ సతీమణి మధులిక రావత్ డిసెంబర్ 14న హిమగిరికి పూజలు చేసి పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నదిలోకి జలప్రవేశం చేయించారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని జీఆర్‌ఎస్‌ఈ(గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్) యార్డ్‌లో ఈ యుద్ధనౌక తయారు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న సీడీఎస్ జనరల్ రావత్ మాట్లాడుతూ... దేశ రక్షణలో ఎలాంటి పరిస్థితుల్నైనా ఎదుర్కొనేందుకు భారత దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయన్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : తొలి దేశీయ స్టెల్త్ యుద్ధనౌక హిమగిరి ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : త్రిదళాధిపతి(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్
ఎక్కడ : హుగ్లీ నది, కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
Published date : 15 Dec 2020 05:58PM

Photo Stories