Skip to main content

హోబర్ట్ ఓపెన్‌లో సానియాకు డబుల్స్ టైటిల్

హోబర్ట్ ఇంటర్నేషనల్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు డబుల్స్ టైటిల్ లభించింది.
Current Affairsఆస్ట్రేలియాలోని హోబర్ట్‌లో జనవరి 18న ముగిసిన ఈ టోర్నిలో సానియా (భారత్)-నదియా కిచోనోక్ (ఉక్రెయిన్) జంట చాంపియన్‌గా నిలిచింది. 81 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సానియా-నదియా ద్వయం 6-4, 6-4తో షుయె పెంగ్-షుయె జాంగ్ (చైనా) జంటను ఓడించింది. 33 ఏళ్ల సానియాకు కెరీర్‌లో ఇది 42వ డబుల్స్ టైటిల్‌కాగా... 27 ఏళ్ల నదియా ఐదో డబుల్స్ టైటిల్‌ను దక్కించుకుంది. విజేత సానియా-నదియా జంటకు 13,580 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 9 లక్షల 65 వేలు)తోపాటు 280 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 2017లో బెథానీ మాటెక్ సాండ్‌‌స (అమెరికా)తో కలిసి బ్రిస్బేన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన తర్వాత సానియా ఖాతాలో చేరిన తొలి టైటిల్ ఇదే.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
హోబర్ట్ ఓపెన్‌లో డబుల్స్ టైటిల్ విజేత
ఎప్పుడు : జనవరి 18
ఎవరు : సానియా మీర్జా (భారత్)-నదియా కిచోనోక్ (ఉక్రెయిన్)
ఎక్కడ : హోబర్ట్, ఆస్ట్రేలియా

మాదిరి ప్రశ్నలు
Published date : 20 Jan 2020 05:49PM

Photo Stories