Skip to main content

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా దత్తాత్రేయ

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్‌గా బీజేపీ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం చేశారు.
సిమ్లాలో సెప్టెంబర్ 11న జరిగిన కార్యక్రమంలో దత్తాత్రేయతో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ రామ సుబ్రహ్మణ్యన్ ప్రమాణం చేయించారు. కల్‌రాజ్ మిశ్రా స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జయరాం సింగ్ ఠాకూర్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

సెప్టెంబర్ 1వ తేదీన మొత్తం ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు వెలువరించారు. తెలంగాణకు ఈఎస్‌ఎల్ నరసింహన్ స్థానంలో తమిళిసై సౌందరరాజన్, హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా(78)ను రాజస్తాన్ గవర్నర్‌గా, హిమాచల్ ప్రదేశ్‌కు నూతన గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ, కేరళ గవర్నర్‌గా ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, మహారాష్ట్ర గవర్నర్‌గా విద్యాసాగర్‌రావు స్థానంలో భగత్ సింగ్ కోశ్యారీ(77)ని నియమించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్‌గా ప్రమాణం
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : బండారు దత్తాత్రేయ
ఎక్కడ : సిమ్లా, హిమాచల్ ప్రదేశ్
Published date : 11 Sep 2019 05:36PM

Photo Stories