Skip to main content

హెచ్‌సీఏ అధ్యక్ష పదవి నుంచి తొలగింపునకు గురైన క్రికెటర్‌?

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్‌ మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ను ఆ పదవినుంచి తప్పిస్తున్నట్లు హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ జూన్‌ 17న ప్రకటించింది.
Current Affairs నిబంధనలకు విరుద్ధంగా, ఉద్దేశపూర్వకంగా హెచ్‌సీఏ ప్రయోజనాలు దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆయన హెచ్‌సీఏ సభ్యత్వం కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అయితే అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయానికి చట్టబద్ధత ఉందా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత లేని నేపథ్యంలో అజహర్‌పై వేటు అంశం ఆసక్తికరంగా మారింది.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : హెచ్‌సీఏ అధ్యక్ష పదవి నుంచి తొలగింపునకు గురైన క్రికెటర్‌?
ఎప్పుడు: జూన్‌ 16
ఎవరు : భారత మాజీ కెప్టెన్‌ మొహమ్మద్‌ అజహరుద్దీన్‌
ఎందుకు : హెచ్‌సీఏ ప్రయోజనాలు దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నందువల్ల...
Published date : 17 Jun 2021 08:54PM

Photo Stories