Skip to main content

హైదరాబాద్‌లోని ఏ రోడ్డు మార్గానికి మాజీ ప్రధాని పీవీ పేరు పెట్టారు?

హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌ (పీవీ మార్గ్)లోని జ్ఞానభూమిలో జూన్ 28న నిర్వహించిన పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పాల్గొన్నారు.
Current Affairs
ఈ సందర్భంగా పీవీ మార్గ్‌లో ఏర్పాటు చేసిన ఆయన కాంస్య విగ్రహాన్ని గవర్నర్‌ తమిళిసైతో కలసి సీఎం ఆవిష్కరించారు. అలాగే నెక్లెస్‌రోడ్‌ను ‘పీవీ మార్గ్‌’గా నామకరణం చేస్తూ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని, పీవీ జ్ఞానభూమిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీవీపై రూపొందించిన తొమ్మిది పుస్తకాలను తమిళిసైతో కలిసి సీఎం ఆవిష్కరించారు. ఏడాది కాలంగా రాజ్యసభ ఎంపీ కే.కేశవరావు నేతృత్వంలోని కమిటీ పీవీ శత జయంతి ఉత్సవాలను నిర్వహించిందని ముఖ్యమంత్రి చెప్పారు.

చదవండి: పీవీ శత జయంతి ఉత్సవాలు–వివరాలు

ముఖ్యమంత్రి దళిత సాధికారత పథకానికి రూ.1,000 కోట్లు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న ‘సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ స్కీం (ముఖ్యమంత్రి దళిత సాధికారత పథకం)’కు ఏటా రూ.1,000 కోట్లను ఖర్చు చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జూన్‌ 26న ప్రకటించారు. ఈ పథకం కింద ఏటా కొంతమంది లబ్ధిదారులను ఎంపిక చేసి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను త్వరలో ఖరారు చేయనున్నట్లు తెలిపారు. దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్‌) ఉన్న 8 లక్షల దళిత కుటుంబాలను దశల వారీగా అభివృద్ధిపరచడమే లక్ష్యంగా ఈ పథకం కింద వివిధ కార్యక్రమాలు చేపడతామన్నారు.
Published date : 29 Jun 2021 06:21PM

Photo Stories