Skip to main content

హైదరాబాద్‌లో మైక్రాన్ గ్లోబల్ సెంటర్

అమెరికాకు చెందిన సెమీకండక్టర్ల తయారీ సంస్థ మైక్రాన్ టెక్నాలజీ తాజాగా హైదరాబాద్‌లో గ్లోబల్ డెవలప్‌మెంట్ సెంటర్ (జీడీసీ)ని ఆవిష్కరించింది.
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అక్టోబర్ 4న ఈ సెంటర్‌ను ప్రారంభించారు. సుమారు 3,50,000 చ.అ. విస్తీర్ణంలో ఈ సెంటర్ ఏర్పాటు చేసినట్లు మైక్రాన్ సీఈవో సంజయ్ మెహ్‌రోత్రా తెలిపారు. ఇటీవలే ప్రారంభించిన బెంగళూరు కార్యాలయంతో పాటు హైదరాబాద్ జీడీసీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య సుమారు 700 దాకా ఉంటుందని పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
మైక్రాన్ టెక్నాలజీ గ్లోబల్ డెవలప్‌మెంట్ సెంటర్ (జీడీసీ) ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 4
ఎవరు : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్
ఎక్కడ : హైదరాబాద్
Published date : 05 Oct 2019 05:44PM

Photo Stories