Skip to main content

హైదరాబాద్‌లో ఇస్టా కాంగ్రెస్ ప్రారంభం

హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో జూన్ 26న అంతర్జాతీయ విత్తన పరీక్షల సంఘం (ఇస్టా) సదస్సును కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి కైలాష్ చౌదరి ప్రారంభించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆసియాలో తొలిసారి ఇస్టా సదస్సు భారత్‌లో జరగడం గర్వకారణమన్నారు. ప్రపంచంలోనే భారతదేశంలో విత్తన పరిశ్రమ వేగంగా ఎదుగుతుందని చెప్పారు. దేశంలో విత్తనోత్పత్తికి తెలంగాణ అనుకూలంగా ఉంద న్నారు. అందుకే దేశవ్యాప్తంగా 500కు పైగా విత్తనోత్పత్తి సంస్థలుంటే, అందులో తెలంగాణలోనే 400కు పైగా ఉన్నాయన్నారు.

ఇస్టా సదస్సుకు 80 దేశాల నుంచి 800 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఇస్టా ప్రెసిడెంట్ డాక్టర్ క్రెగ్ మెక్‌గ్రిల్, ఇస్టా సెక్రటరీ జనరల్ డాక్టర్ ఆండ్రియాస్ వాయస్ సదస్సులో పాల్గొన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అంతర్జాతీయ విత్తన పరీక్షల సంఘం (ఇస్టా) సదస్సు ప్రారంభం
ఎప్పుడు : జూన్ 26
ఎవరు : కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి కైలాష్ చౌదరి
ఎక్కడ : నోవాటెల్, హైదరాబాద్
Published date : 27 Jun 2019 05:42PM

Photo Stories