Skip to main content

హాథ్రస్‌ కేసుపై సీబీఐ దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యతను ఏ హైకోర్డుకు అప్పగించారు?

దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ‘హాథ్రస్‌’ఘటనపై సుప్రీంకోర్టు అక్టోబర్ 27న పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది.
Current Affairsఈ కేసుపై సీబీఐ దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యతను అలహాబాద్‌ హైకోర్టుకు అప్పగించింది. బాధిత కుటుంబం, సాక్షుల భద్రతను అలహాబాద్‌ హైకోర్టే చూసుకుంటుందని స్పష్టం చేసింది. ఈ కేసు విచారణను ఉత్తరప్రదేశ్‌ వెలుపల చేపట్టాలన్న వినతిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏబాబ్డే, జస్టిస్‌ ఏఎస్‌ బొపన్న, జస్టిస్‌ వి. రామసుబ్రమణియన్ ల ధర్మాసనం ఈ మేరకు స్పందించింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ వినతి మేరకు హాథ్రస్‌ బాధితురాలి పేరును ఇప్పటికే ఇచ్చిన తీర్పు నుంచి తొలగించాలని అలహాబాద్‌ హైకోర్టుకు సూచించింది. బాధిత కుటుంబం, సాక్షుల భద్రత బాధ్యతను వారం రోజుల్లో సీఆర్‌పీఎఫ్‌కు అప్పగించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Published date : 28 Oct 2020 05:20PM

Photo Stories