హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న భారత క్రికెటర్?
Sakshi Education
తొలి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ను పురస్కరించుకొని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పది మంది దిగ్గజ క్రికెటర్లకు ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు కల్పించింది.
ఇందులో భారత్ నుంచి దివంగత క్రికెటర్ వినూ మన్కడ్‌కు... శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరకు స్థానం దక్కింది. 1978లో మృతి చెందిన వినూ మన్కడ్ భారత్ తరఫున 1947 నుంచి 1959 మధ్య కాలంలో 44 టెస్టులు ఆడి 2,109 పరుగులు చేయడంతోపాటు 162 వికెట్లు తీశారు. వినూ మన్కడ్, సంగక్కరలతోపాటు మోంటీ నోబుల్ (ఆస్ట్రేలియా), కాన్‌స్టన్ టైన్ (వెస్టిండీస్), స్టాన్ మెక్‌కేబ్ (ఆస్ట్రేలియా), డెక్స్‌టర్ (ఇంగ్లండ్), హేన్స్ (వెస్టిండీస్), బాబ్ విల్లీస్ (ఇంగ్లండ్), ఆండీ ఫ్లవర్ (జింబాబ్వే) కూడా ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో స్థానం పొందారు.
Published date : 15 Jun 2021 08:19PM